Share On

స‌మాజంలో ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర నిత్యం ఆడ‌వారిపై అత్యాచారాలు, వేధింపులు, దారుణాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఎదురు తిరుగుతేనే ప్ర‌తి దానికి ప‌రిష్కారం ఉన్న‌ట్టు, వేధింపుల‌కు గురైన వారు కూడా ఎదురుతిరిగితేనే దారుణాలు త‌గ్గుముఖం ప‌డుతాయి. త‌నపై అత్యాచారానికి ప్ర‌య‌త్నించిన వ్య‌క్తిని చంపి త‌న‌ను తాను ర‌క్షించుకొంది ఒక యువ‌తి. త‌న ప్రాణాల‌ను, మానాన్ని కాపాడుకునే ప్ర‌య‌త్నంలో ఆ ఉన్మాదిని క‌త్తితో హత్య చేసి, చివ‌ర‌కు పోలీసుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి అస‌లు విష‌యం చెప్ప‌డంతో ఆ 19 సంవ‌త్స‌రాల యువ‌తి ధైర్యానికి పోలీసులే షాక‌య్యారు. త‌మిళ‌నాడు లోని తిరువ‌ళ్లూరు పీఎస్ ప‌రిధిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.

ఎస్పీ అర‌వింద్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం తిరువళ్లూరు కు చెందిన ఒక‌ యువ‌తిని ఆమె స‌మీప బంధువు గ‌త కొన్ని నెల‌లుగా వేధింపుల‌కు గురిచేస్తున్నాడు. ఈ విష‌య‌మై త‌న కుటుంబ‌స‌భ్యులకు తెలుప‌గా, వారు ఆ వ్య‌క్తిని (24) మందలించారు. దానితో కోపం పెంచుకున్న ఆ ఉన్మాది పీక‌ల దాకా తాగి జ‌న‌వ‌రి 3, ఆదివారం రాత్రి స‌మ‌యంలో ఆ యువ‌తి ఇంటి వద్ద కాపు కాశాడు. ఆమె వాష్ రూమ్ కోస‌మ‌ని బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మయంలో, మెల్ల‌గా ఆమెను స‌మీపించి అత్యాచారానికి య‌త్నించాడు. అతని నుంచి వ‌దిలించుకొనే ప్ర‌య‌త్నంలో గ‌ట్టిగా నెట్టివేసింది. ఆ స‌మ‌యంలో ఆ ఉన్మాది వెంట‌తెచ్చుకున్న క‌త్తి కింద ప‌డ‌డంతో ఏ మాత్రం ఆల‌స్యం చేయకుండా , ఆ క‌త్తితో అత‌ని గొంతు కోసి చంపేసింది. అదే ధైర్యంతో ద‌గ్గ‌ర‌లోని పోలీస్ స్టేష‌న్ కి వెళ్లి తాను చేసిన హ‌త్య గురించి ఏ మాత్రం కంగారు లేకుండా పోలీసుల‌కు వివ‌రించింది. ఆమె చెప్పిన‌దంతా విన్న పోలీసులు ప్రాణ‌, మాన ర‌క్ష‌ణ కోసం ఆ యువ‌తి ఈ హ‌త్య చేసిందని, ఆమెపై సెక్ష‌న్ 100 కింద కేసు న‌మోదు చేసి అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు. త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగుతోంద‌ని తెలిపారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!