Share On

ఇద్ద‌రు ఇష్ట‌ప‌డుతే చాలు.. ప్రాంతాల‌తో, దేశాల‌తో సంబంధం లేద‌ని మ‌రోసారి రుజువు చేశారు. దేశాలు వేరైనా ఇరువురి కుటుంబాల్లో ఒప్పించి ఆ ఇద్ద‌రూ ఒక్క‌టైపోయారు. పెద్ద‌ల స‌మ‌క్షంలో ఆంధ్రా అబ్బాయి.. ఆఫ్షనిస్తాన్ అమ్మాయి ఒక్కటయ్యారు.‌ హిందూ వివాహ సంప్రదాయ పద్దతిలో మూడు ముళ్ల‌ బంధంతో, ఏడు అడుగులు నడిచారు. విజయవాడలో జరిగిన వివాహ రిసెప్షన్‌లో ఆహ్వానితులు నవ దంపతులను ఆశీర్వదించారు. రైల్వే డిఎస్పీగా పని‌చేస్తున్న అశోక్ కుమార్, లక్ష్మీ మహేశ్వరి దంపతుల కుమారుడు వివేకానంద రామన్ ఢిల్లీలో జాబ్ చేస్తుండగా, అక్కడ ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అమ్మాయి ఫ్రోజ్ షిరిన్‌తో పరిచయం ఏర్పడింది. మాటా మాటా కలవడంతో పాటు మనసులు కూడా దగ్గరయ్యాయి. కలిసి నడుద్దామని నిర్ణయించుకున్న ఆ జంట ఇంట్లో పెద్దలకు వారి ప్రేమ విషయం చెప్పారు. సినిమాల తరహాలో ట్విస్ట్‌లు లేకుండా వారు కూడా పిల్లల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ‌హిందూ వివాహ సంప్రదాయ పద్దతిలో మూడు ముళ్ల బంధంతో‌ ఆంధ్రా అబ్బాయి, ‌ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి ఒక్కటయ్యారు. ఆమె తనకు నచ్చిందని ఇద్దరి ప్రేమను ఇంట్లో వాళ్లు కూడా అంగీకరించి పెళ్లి చేయడం ఆనందంగా ఉందని వరుడు వివేకానంద రామన్ చెప్పారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!