ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికి పలు దేశాలను వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం అతి భయంకరంగా కేసులు నమోదవుతూ, లక్షల్లో మరణిస్తున్నారు. భారతదేశంలో కూడా కరోనా నివారణకు ప్రతిరోజు కరోనా పరీక్షలు చేస్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ కోసం పరీక్షించిన నమూనాల సంఖ్య 18 కోట్లు దాటింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 9,16,951 నమూనాలను పరీక్షించగా మొత్తం నమూనాల సంఖ్య 18,02,53,315కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా 18,222 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం క్రియాశీల కేసులు 2,24,190 ఉన్నాయి. శుక్ర-శనివారాల మధ్య 228 మంది కరోనాతో కన్నుమూశారు. కరోనా నియంత్రణకు అన్ని రాష్ట్రాలు కఠినచర్యలు తీసుకొవాలని కేంద్రం సూచించింది.