Share On

అవినీతి నిర్మూలన కోసం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వినూత్న కార్యక్రమాలతో ముందుకు నడవాలని మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా అన్నారు. కరోనా సమయంలో ఇరవై నాలుగు గంటలు ఉచితంగా మెడిసిన్ సేవలు అందించిన వైఏసీ సభ్యుల అత్మీయ సత్కార కార్యక్రమం హైదరాబాద్ సోమజిగూడ NKM గ్రాండ్ హోటల్ లో యూత్ ఫర్ ఆంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. అవినీతి అనేది రోజురోజుకు పెరుగుతుందని, దానిని నిర్మూలించేందుకు అన్ని రంగాల ప్రజలను, యువకులను చైతన్యవంతం చేయాలన్నారు. గత పది సంవత్సరాల నుంచి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వివిధ కార్యక్రమాలతో ముందుకు వెళ్లడం చాలా అభినందనీయమన్నారు. మరిన్ని కార్యక్రమాలతో మంచి సమాజం కోసం కృషి చేయాలన్నారు. పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్బంగా వైఏసీ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

సంగారెడ్డి జిల్లా జైలు సూపరిండెంట్ శివ కుమార్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడే వ్యక్తుల్ని వదిలేయకుండా వారిని కూడా అవినీతి నిరోధక సంస్థల సభల్లో బాగస్వాముల్ని చేస్తే వారిలో కూడా మార్పు తీసుకురావొచ్చని, రానున్న సంవత్సరంలో యాక్ సంస్థ సభ్యులని రెండింతలుగా వాలంటీర్లని పెంచి మరింత మందికి చేరువయ్యేలా చేయాలన్నారు. వారు సమాజంలో అవినీతి అనేది ఎంత ప్రమాదకరం దాని వల్ల ఎంత నష్టం వాటిల్లిందనే విషయాన్ని యాక్ వాలంటీర్లకు వివరించి వారి అనుభవంలో ఎదురైన కొన్ని అవినీతి సమస్యలు వాటిపై సాధించిన విజయాలు, RTI చట్టం సమాజం పై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని వివారిస్తూనే ఈ యాక్ సంస్థ అవినీతిపై చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో వివరించారు, దానితో పాటుగా గత పది సంవత్సరాలుగా ఆ సంస్థ చేస్తున్న పలు కార్యక్రమాలను కొనియాడారు. ఈ కరోనా సమయంలో అందరూ తమ సొంత వారికి ఆపద వస్తేనే బయటకి రావడానికి ఎంతో ఆలోచించరని, అలాంటి గడ్డు పరిస్థితుల్లో యాక్ సంస్థ చేసిన కార్యక్రమాలని అభినందించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ  అవినీతి నిరోధక  సంస్థ కేవలం వారికి వచ్చిన ఫిర్యాదులపై మాత్రమే కాకుండా వాళ్లే స్వతహాగా ఎవరిపై అయిన నిఘా పెట్టి పట్టుకునే పద్దతి వస్తే బాగుంటుందన్నారు.

సీనియర్ పాత్రికేయులు మరియు రైస్ బకెట్ సంస్థ వ్యవస్థాపకులు మంజులత కలనిది మాట్లాడుతూ మీరు మేము కలిసి ఈ యాక్ సంస్థ ని మరింత బలోపేతం చేద్దాం కలిసి పోరాడుదాం మెరుగైన సమాజ నిర్మాణంలో బాగస్వాములం కావాలన్నారు. ప్రభుత్వాల్లో వివిధ స్థాయిల్లో జరిగే అవినీతి వలనే మా రైస్ బకెట్ ఛాలెంజ్ లాంటి స్వచ్చంద సంస్థల సహాయాన్నీ శరణార్థులు కోరుకుంటున్నారని ఈ పరిస్థితి మారాలని, లాక్డౌన్ సమయంలో వాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సేవలందించిన వాలంటీర్లకి అభినందనలు తెలిపారు. ఎంహెచ్ఆర్డీ సీనియర్ ప్యాకల్టీ శ్రీనువాస్ మాధవ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని వాడుకోవాలని, వైఏసీ సంస్థకు అది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందన్నారు. ఒక విషయంపై, అవినీతిపై పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రశ్నించాలన్నారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లయన్స్ క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ జేఎస్ మోహన్ రావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ రవిశంకర్, వైఏసీ సంస్థ సభ్యులు రామకృష్ణ, గిరిధర్, కొమటి రమేష్ బాబు, మారియా అంతోని, స్వప్నారెడ్డి, జి. జయరాం, కె. దేవేందర్, వి. గంగాధర్, జి. హరి ప్రకాష్  ప్రతినిధులు మరియు తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాల యాక్ ఇంచార్జ్ లు, వాలంటీర్లు పాల్గొనారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!