Share On

మ‌నిషి క‌ష్ట‌ప‌డుతే చాలు.. బ‌త‌కడానిక ప‌లు మార్గాలు ఉన్నాయి.. బ‌త‌క‌డానికి చేసే ప‌నిలో ఆడ, మ‌గ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవ‌రికి న‌చ్చిన ప‌ని వారు చేసుకొవ‌చ్చు. మ‌గవాళ్లే ఫ‌లానా ప‌నిచేయాల‌నే రూలేమి లేదు. కుటుంబ పోష‌ణ కోసం, జీవ‌నోపాధి కోసం ఒక మ‌హిళ ఈత‌, తాటి చెట్లు ఎక్కుతూ క‌ల్లు గీస్తున్న‌ది. క‌ల్లు గీయ‌డంలో ఈ మ‌హిళ‌నే రాష్ట్రంలో మొద‌టి మ‌హిళ కావ‌చ్చని అంటున్నారు.

నారాయ‌ణ‌ఖేడ్ మండ‌లం రేగోడ్ గ్రామానికి చెందిన పుర్ర సావిత్రి(25) భ‌ర్త కొన్ని నెల‌ల క్రితం చనిపోయాడు. భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత కుటుంబాన్ని పోషించ‌డం సావిత్రికి భారంగా మారింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో పాటు మామ‌ను పోషించ‌డం క‌ష్టమైంది. చేసేదేమీ లేక త‌న భ‌ర్త వృత్తిని ఆమె ఎంచుకుంది. క‌డుపు నింపుకునేందుకు క‌ల్లు గీయ‌డం మొద‌లెట్టింది. మొద‌ట్లో చిన్న చిన్న ఈత చెట్ల‌ను ఎక్క‌డం ప్రారంభించిన సావిత్రి, ప్ర‌స్తుతం పెద్ద పెద్ద చెట్ల‌ను ఎక్కి క‌ల్లు గీస్తుంది. 8 కిలోమీట‌ర్లు. 50 లీట‌ర్ల క‌ల్లు
సావిత్రి పొద్దున్నే 5 గంట‌ల‌కు లేచి 8 కిలోమీట‌ర్లు న‌డ‌క సాగిస్తోంది. ఆ త‌ర్వాత ఈదుళ్ల‌కు చేరుకుని రోజుకు 50 లీట‌ర్ల క‌ల్లు సేక‌రిస్తుంది. త‌ర్వాత మ‌ళ్లీ చెట్ల‌కు లొట్ల‌ను క‌ట్టి సేక‌రించిన క‌ల్లు తీసుకుని రోడ్డుపైకి వ‌స్తోంది. ర‌హ‌దారి గుండా పోయే వారితో పాటు స‌మీప గ్రామాల ప్ర‌జ‌లకు క‌ల్లును అమ్మి రోజుకు రూ. 400 వ‌ర‌కు సంపాదిస్తోంది. ఆ డ‌బ్బుతో జీవ‌నం కొన‌సాగిస్తోంది.

ప్ర‌తి రోజు ఈత చెట్లు ఎక్క‌డం క‌ష్టంగా ఉన్నా, కుటుంబ పోష‌ణ కోసం త‌ప్ప‌డం లేదంటుంది. కండ‌రాల్లో నొప్పి వ‌స్తున్న‌, త‌న ప‌నికి విరామం చెప్ప‌కుండా క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నాను. జీవ‌నం కొన‌సాగించేందుకు త‌న‌కు మ‌రో మార్గం లేద‌ని సావిత్రి అంటోంది. ఇటీవ‌లే త‌న‌కు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ టీఎఫ్‌టీ(ట్రీ ఫ‌ర్ ట్యాప‌ర్స్‌) లైసెన్స్ మంజూరు చేసిందని, ఈ లైసెన్స్ వ‌ల్ల తాను రోజుకు 30 చెట్ల నుంచి క‌ల్లు తీసుకునే అనుమ‌తి ల‌భించింద‌ని సావిత్రి పేర్కొంది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!