అతను ప్రవేట్ బ్యాంకులో పనిచేసే ఉద్యోగి.. అతనికి పెళ్లి అయింది, ఒక పాప కూడా ఉంది.. కాని కుటుంబాన్న పట్టించుకోకుండా వేరే అమ్మాయితో సహజీవనం చేస్తూ భార్యను వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తున్న భర్తను తన భార్య అతను పనిచేస్తున్న బ్యాంకులోనే అందరి ముందు చొక్కా పట్టుకొని చితకబాదింది. వరంగల్‌కు చెందిన శ్రీనివాస్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలో ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. 10 సంవత్సరాల క్రితం ఒక మహిళను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారికి ఒక పాప కూడా ఉంది. కొంతకాలంగా మరో మహిళతో సహజీవనం చేస్తున్న శ్రీనివాస్ భార్యను పట్టించుకోవడం మానేశాడు. భర్త అక్రమ సంబంధం తెలుసుకున్న ఆమె నిలదీయగా ఇంటికి కూడా రాకుండా కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో మంగళవారం బ్యాంకుకు వచ్చిన ఆమె అందరి ముందే శ్రీనివాస్‌ను నిలదీసింది. నాకు అన్యాయం చేస్తావా అంటూ చొక్కా పట్టుకుని భర్తను చితకబాదింది. ఈ పరిణామానికి షాకైన బ్యాంకు సిబ్బంది ఆమెను నిలవరించేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో బ్యాంకులో ఉన్న వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. కొందరు తమ సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.