Share On

దేశంలో ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో బ‌ర్డ్‌ఫ్లూ పెరుగుతోంది. బ‌ర్డ్‌ఫ్లూ నివారించాల‌ని ప‌లు రాష్ట్రాల నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అందులో భాగంగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలపై నిషేధం విధించారు. పౌల్ట్రీతోపాటు షాపులు, రెస్టారెంట్లలో ప్రాసెసింగ్ చేసిన చికెన్ నిల్వ, అమ్మకాలపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ), సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎండీసీ) ప్రకటించాయి. హోటళ్లు, రెస్టారెంట్లు కస్టమర్లకు గుడ్డు, చికెన్ ఉత్పత్తులను విక్రయిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామని ఎన్‌డీఎంసీ హెచ్చరించింది. పౌల్ట్రీ లేదా ప్రాసెస్డ్ లేదా ప్యాకేజ్డ్ చికెన్ మాంసాన్ని నిల్వ చేయడం, విక్రయించడాన్ని తక్షణమే నిషేధిస్తున్నట్లు ఎన్‌డీఎంసీ తెలిపింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.

ఢిల్లీ వెలుపలి నుంచి ప్రాసెస్డ్ అండ్ ప్యాకెజ్డ్ చికెన్ కొనుగోలుపై కేజ్రీవాల్ సర్కారు ఇప్పటికే నిషేధం విధించింది. దేశ రాజధానిలోని కాకులు, బాతుల శాంపిళ్లలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. గత వారం రోజుల్లో ఢిల్లీలోని సంజయ్ లేక్ వద్ద భారీ సంఖ్యలో బాతులు.. వివిధ పార్కుల్లో కాకులు చనిపోయి కనిపించాయి. ప్రజలు బర్డ్ ఫ్లూ గురించి భయాందోళనకు గురి కావద్దని బాగా ఉడికించి పౌల్ట్రీ ఉత్పత్తులను తినాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ సూచించిన కాసేపటికే ఎన్‌డీఎంసీ చికెన్ అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!