మ‌రీ బ‌రితెగించిన లంచ‌గొండి అధికారిణీ

Share On

ప్ర‌జ‌ల ప‌న్నుల‌తో, ప్ర‌జ‌ల సొమ్ముతో బతుకుతూ, ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల్సిన అధికారులు కొంత‌మంది మ‌రీ బ‌రితెగించి లంచాలు వ‌సూలు చేస్తున్నారు. లంచం తీసుకుంటే ఏమి కాద‌ని, మ‌మ్ముల ఎవ‌రూ ఏమి చేయ‌లేరని ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌తి ప‌నికి అందిన కాడికి దండుకుంటూ, లేని వారిని జ‌ల‌గ‌ల్లా పీడించే అవినీతి అధికారులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నారు. ఎవ‌రైనా అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తూ, వెన‌కాముందు వంద‌సార్లు చూస్తూ, ఎవ‌రూ గ‌మ‌నించ‌డం లేద‌ని తెలిశాక‌నే లంచం తీసుకుంటారు. కాని ఒక అధికారిణీ మాత్రం ధైర్యంగా ఎవ‌రూ చూసినా, ఏమి కాద‌ని, మ‌రీ సిసి కెమెరాల‌కు చూపిస్తూ లంచం తీసుకుంది. చివ‌ర‌కు స‌స్పెండ్ అయి ఇంట్లో కూర్చోంది.

శ్రీకాకుళం జిల్లాలో ఒక‌ అధికారి మాత్రం సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. శ్రీకాకుళం జిల్లాలో కర్మాగారాల శాఖ తనిఖీ కార్యాలయంలో ఒక‌ అధికారిణిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అందుకు కారణం ఆమె సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకోవడమే. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న బి.కుసుమ కుమారి 18 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. మొదటి నుంచి బాధ్యతారాహిత్యంగా పని చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఆమె పని తీరుపై విమర్శలు రావడంతో ఇటీవల అధికారులు సీసీ కెమెరాలు పెట్టించినట్లు తెలిసింది. ఇటీవల ఆమె భయపడకుండా సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకుంది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్​ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆమెను సస్పెండ్ చేసినట్లు కర్మాగారాల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ శర్మ మీడియాకు తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *