వైద్యం కోసం వ‌స్తే వేధింపుల‌కు పాల్ప‌డ్డ వైద్యుడు

Share On

ఆనారోగ్యంతో ఉన్నవారు ప్ర‌తి ఒక్క‌రూ దేవుడిగా కొలిచేది డాక్ట‌ర్‌నే. కాని ప్రాణం పోయాల్సిన డాక్ట‌రే వైద్యం కోసం వచ్చిన పెళ్లయిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ కీచక వైద్యుడిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కంకిపాడుకు చెందిన డాక్టర్ శివరామ కృష్ణ మొవ్వ గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తూ ఈడుపుగళ్ళు గ్రామంలో సొంత క్లినిక్ నడుపుతన్నారు. ఈ క్రమంలో వైద్యం కోసం వచ్చిన ఈడుపుగళ్ళుకు చెందిన వివాహితతో డాక్టర్ అసభ్యకంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించారు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వైద్యుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version