98 ఏళ్లు వ‌చ్చినా ఆయ‌న న‌వ‌యువ‌కుడే

Share On

ఒంటిలో సత్తువ ఉన్నా.. ప‌నిచేసే ఆలోచ‌న ఉన్నా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారి సంఖ్య త‌గ్గిపోతుంది.. బ‌ద్ద‌క‌స్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. కాని ఒక వృద్దుడికి 98 సంవ‌త్స‌రాలు వ‌చ్చినా త‌న కుటుంబానికి అండ‌గా ఉండేందుకు త‌న వంతుగా ప‌నిచేస్తూ ఒక తోపుడు బండిని న‌డిపిస్తున్నాడు. ఆయ‌న ప‌నిత‌నాన్ని చూసి జిల్లా మేజిస్ట్రేట్ చూసి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ ఘ‌న స‌న్మానం చేశారు.

ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలికి చెందిన విజయ్‌ పాల్‌ సింగ్‌ వయసు 98 సంవ‌త్స‌రాలు. అదృష్టం కొద్ది అయన ఆరోగ్యం కూడా బాగానే ఉంది. తన పనులన్ని తానే చేసుకోగలడు. ఒంట్లో కాస్తా శక్తి ఉండడంతో ఖాళీగా ఉండలేక, తన ఇంటి సమీపంలో రోడు పక్కన ఒక‌ తోపుడు బండి పెట్టుకున్నాడు. దాని మీద ఉడికించిన శనగలు, మొలకలు పెట్టుకుని అమ్ముతుంటాడు. నిజానికి ఆయన ఈ వయసులో ఇలా పని చేయడం ఆయన కుటుంబంలో ఎవరికీ కూడా ఇష్టం లేదు. కానీ ఖాళీగా కూర్చోవడం తనకు నచ్చదని అందుకే పని చేస్తునట్టుగా ఆ తాత చెపుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో జిల్లా మేజిస్ట్రేట్ వైభవ్‌ శ్రీవాస్తవ, విజయ్‌ పాల్‌ సింగ్‌ని తన కార్యాలయానికి ఆహ్వానించి11,000 రూపాయల నగదును అందజేశారు. అంతేకాకుండా శాలువా కప్పి సన్మానం కూడా చేశారు.. వీటితో పాటుగా వాకింగ్ స్టిక్, సర్టిఫికేట్‌ అందజేశారు. ప్రభుత్వ పథకం కింద వృద్ధుడికి ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!