ఆ న‌ర‌సమ్మ.. ఇప్ప‌టి త‌రానికి ఒక స్పూర్తి..

Share On

వైద్యం చేయాలంటే పెద్ద పెద్ద పుస్త‌కాలే చ‌దవాలా… ప‌రిశోధ‌న కేంద్రాల్లో ఇర‌వై నాలుగు గంట‌లు త‌ల‌మున‌క‌లు కావాలా.. అంత చ‌దివినా.. అంత చేసినా ప్ర‌జ‌ల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్న‌వారెక్క‌డంటే ఒక‌టి, రెండు, మూడు అంటే వేళ్ల‌పై లెక్క‌పెట్టాల్సిందే.. మాన‌వ‌త్వంగా ప్ర‌జ‌ల్లో పేరు సంపాదించుకునే వైద్యులు ఇప్ప‌టి స‌మాజంలో క‌రువైపోతున్నారు.. ప్ర‌తి చిన్న ప్ర‌సూతి కాన్పుకు కూడా ల‌క్ష‌ల్లో ఫీజులు వ‌సూలు చేసే కార్పోరేట్ ఆసుపత్రుల నీడ‌లో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు.. కాని ఒక ప్రాంతంలో వ‌య‌స్సు మీద 100కు ద‌గ్గ‌రున్నా ఒక్క రూపాయి ఫీజు కూడా వ‌సూలు చేయ‌కుండా వేలాది మందికి ప్ర‌కృతి వైద్యం పేరుతో ఉచిత వైద్యాన్ని అందిస్తున్న సూల‌గుత్తి న‌ర‌స‌మ్మ నేటి త‌రానికి ఒక ఆద‌ర్శం.. ఆమె అతి సామాన్య జీవితం ఇప్ప‌టి వైద్యుల‌కు స్పూర్తి..

100 సంవ‌త్స‌రాల‌కు చేరువ‌లో ఉన్న సూల‌గుత్తి న‌ర‌స‌మ్మ క‌ర్ణాట‌క‌లోని వెన‌క‌బ‌డిన ఒక కొండ ప్రాంతం. అక్క‌డ ఏలాంటి వైద్య స‌దుపాయాలే కాకుండా క‌నీసం రోడ్డు కూడా లేని తండాలు అక్క‌డ ఎన్నో ఉన్నాయి. అక్క‌డ వైద్యం ఎవ‌రికి దొర‌క‌దు.. కాస్త లేట‌యితే ప్రాణాలు కూడా గాలిలో క‌ల‌వాల్సిందే.. అలాంటి కొండ ప్రాంతంలో ప్ర‌కృతి వైద్యం నేర్చుకొని ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తుల‌కు సుఖ‌ప్ర‌స‌వాలు చేస్తోంది న‌ర‌స‌మ్మ‌. ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని కొన్ని గర్భస్థ‌ శిశువు లక్షణాలను ఈవిడ తన ప్రక్రృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలదు. గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు సైతం ఈవిడ చేసే వైద్యానికి, ప్రతిభకు ఆశ్చ‌ర్య‌పోతారు. బెంగుళూరులోని పెద్ద‌పెద్ద‌ ఆసుపత్రుల డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులుగా ఉన్నారు. తల్లి గర్భంలోని శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది, తల ఏ దిశలో ఉంది, ఉమ్మనీరు పరిస్థితి, శిశువు ఆరోగ్యంగా ఉందా, అంగవైకల్యం ఏమైనా ఉందా, ప్రసవం ఎన్ని రోజుల్లో కాగలదు, సిజేరియన్ తప్పనిసరా, పుట్టబోయే బిడ్డ బరువు వంటి విషయాలు ఖచ్చితంగా చెబుతుంది.
ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది.

సూలగుత్తి అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది లేదా మంత్రసాని అని అర్ధం. ఈమె నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవిత కాలంలో 15,000 పైగా ప్రసవాలు చేసింది. తాను చేసిన వైద్యానికి ఎవ‌రి ద‌గ్గ‌ర ఒక్క రూపాయి కూడా తీసుకొదు. ఎవ‌రైనా డబ్బులు గాని, బహుమతులు గానీ తన ఇంటికి పంపిస్తే వాటిని ఆవిడ స్వయంగా పంపించినవారి ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంది. ఆమె రోజువారీ వ్యవసాయ కూలీగా బ్రతుకుతున్నారు. తుమ్కూర్‌ యూనివర్సిటీ ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!