67వ జాతీయ ఫిల్మ్ అవార్డులు ప్ర‌క‌ట‌న

Share On

67వ జాతీయ ఫిల్మ్ అవార్డుల‌ను కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దివంగ‌త హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న‌టించిన చిచోరే సినిమాకు ఉత్త‌మ హిందీ చిత్రం అవార్డు ద‌క్కింది. కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ ఈ అవార్డుల‌ను వెల్ల‌డించింది. క‌రోనా వ‌ల్ల గ‌త సంవ‌త్స‌రం ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. మ‌ణిక‌ర్ణిక.. ద క్వీన్ ఆఫ్ జాన్సీ, పంగా చిత్రాల్లో న‌టించిన కంగ‌నా ర‌నౌత్‌కు ఉత్త‌మ న‌టి అవార్డు ద‌క్కింది. బెస్ట్ నాన్-ఫీచ‌ర్ ఫిల్మ్ అవార్డు యాన్ ఇంజ‌నీర్డ్ డ్రీమ్‌కు ద‌క్కింది. ఉత్త‌మ త‌మిళ చిత్రం అవార్డును అసుర‌న్ గెలుచుకున్న‌ది, ధనుష్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషించారు. మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్‌గా సిక్కిం రాష్ట్రం గెలుచుకున్న‌ది. అసుర‌న్ తీసిన వెట్రి మార‌న్ కు బెస్ట్ డైర‌క్ట‌ర్ అవార్డు ద‌క్కింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!