నాకు ఓటెయ్యండి.. ప్ర‌తి ఇంటికి హెలికాప్ట‌ర్ ఇస్తా

Share On

ఎన్నికల ముందు రాజ‌కీయ నాయ‌కులు ఇచ్చే హామీలు, మాట‌లు వింటే నోరెళ్ల‌పెట్టాల్సిందే. ఓట్ల‌కోసం అమ‌లు కాని హామీలు ఇవ్వ‌డం మామూలైపోయింది. తమిళనాడుకు చెందిన 33 ఏళ్ల తులం శరవణన్‌ అసాధారణ హామీలు ప్రకటించి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రకటించిన హామీలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. గతంలో ఒక‌ టీవీ జర్నలిస్టుగా పనిచేసిన శరవణన్‌, అసెంబ్లీ ఎన్నికల్లో మధురై దక్షిణ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు రూ.20 వేల అప్పు కూడా చేశారు. తాను గెలిస్తే మాత్రం ఈ హామీలన్నీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఇవే కాదు నియోజకవర్గ ప్రజలను నిత్యం చల్లదనం అందించేందుకు 300 అడుగుల కృత్రిమ మంచుకొండ, ప్రతి కుటుంబానికీ ఒక‌ బోటు, అంతరిక్ష పరిశోధన కేంద్రం, రాకెట్‌ లాంచ్‌పాడ్‌ ఏర్పాటు చేస్తాననీ హామీల్లో పేర్కొన్నారు. ఈ హామీలన్నీ ఊరికే చేయలేదని శరవణన్‌ చెప్పారు.

ప్రస్తుత రాజకీయాల్లో నీటిమూటల్లాంటి నేతల అసత్య మాటలను నమ్మకుండా ప్రజలను చైతన్యం చేసేందుకే తానూ ఈ హామీలు ప్రకటించినట్లు శరవణన్‌ వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో గెలవడం పక్కన పెడితే ఈ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం కలిగించడంలో విజయం సాధించానని చెప్పారు. ప్రచారానికి డబ్బులు లేకున్నా తన సహచరులతో పంపిన మెసేజ్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయన్నారు. దీనిపై ప్రజలు ఆలోచన చేస్తున్నారని చెప్పారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!