అత‌నో మాజీమంత్రి.. అత‌ని ప్ర‌చారం ఒక వింత

Share On

ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న అభ్య‌ర్థులు ప్ర‌చారం వింత‌వింత‌గా సాగుతోంది. ఒక అభ్య‌ర్థి త‌న‌కు ఓటు వేసి గెలిపించాల‌ని, గెలిచిన త‌ర్వాత ప్ర‌తి ఇంటికి ఒక హెలికాప్ట‌ర్‌తో పాటు, బోటు ఇస్తాన‌ని ప్ర‌చారం చేస్తే, త‌మిళ‌నాడుకు చెందిన ఆరోగ్య‌శాఖ మంత్రి మాత్రం త‌న‌కు బీపీ, షుగ‌ర్ ఉన్నాయ‌ని, ఎక్కువ‌గా ప్ర‌చారం చేయ‌లేన‌ని త‌న‌ను గెలిపించాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌ల మీదే ఉంద‌ని త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఓట‌ర్ల‌ను జాలి చూపాల‌ని కోరుతున్నాడు. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తి హెల్త్ మినిస్టర్ ఎలా అయ్యాడంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఒక హెల్త్ మినిస్టర్ అయ్యుండి అనారోగ్య సమస్యలను గుర్తు చేస్తూ తనను ఆదరించాలని అడగడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై వివాదం రేగడంతో విజయ్ భాస్కర్ స్పందించారు. తానేమీ సెంటిమెంట్ ఓట్ల కోసం పాకులాడటం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను ఓట్ల కోసం అభ్యర్థించాల్సిన అవసరం లేదని తన ముఖం చూసే ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!