హోలీ రోజు మ‌గాళ్లంతా ఆడ‌వాళ్లుగా మారుతారు

Share On

హోలీ పండుగ ఒక్కో ప్రాంతంలో ఒక్కో ర‌కంగా జ‌రుపుకుంటారు. ఎవ‌రి ఆచార, సంప్ర‌దాయం ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రుపుకుంటారు. కాని క‌ర్నూల్ జిల్లా అథోనిలో మాత్రం హోళీ వేడుక‌లు వింత‌గా జ‌రుగుతాయి. హోలీ పండుగ రోజు మ‌గవాళ్లంతా అచ్చం ఆడవాళ్లుగా మారిపోతారు. వారి కట్టు బొట్టు చీరతో సింగారించుకుంటారు. ఆ తర్వాత హోలీ రోజున రతీమన్మథులను పూజిస్తారు. ఆ తర్వాత నైవేద్యం ఉంచిన పూర్ణ కుంభాన్ని నెత్తిన పెట్టుకొని ఆలయానికి గుంపుగా వెళ్తారు. ఈ క్రమంలో మరింత వింతగా ప్రవర్తిస్తారు. అలా వెళ్తుండగా దారిలో తెలిసిన వారు కనిపిస్తే చాలు బండ బూతులు తిట్టేస్తారట. ఆ వ్యక్తులు గతంలో తమకు ఏదైనా చెడు చేస్తే, అవన్నీ గుర్తు చేస్తూ నాటు డైలాగులతో ఇష్టమొచ్చినట్టు తిడుతారంట‌. వీళ్లు తిడుతుంటే మిగ‌తా వారంద‌రూ దండం పెట్టి శ్ర‌ద్ధ‌గా వింటారంట‌. వారు తిట్టే తిట్ల‌న్నీ త‌మ‌కు దేవుడిచ్చే దీవెన‌ల‌ని భావించ‌డం ఇక్క‌డి సంప్ర‌దాయం. ఈ సంప్ర‌దాయం ఇక్క‌డ త‌ర‌త‌రాలుగా కొన‌సాగుతంది. చీర‌లు క‌ట్టుకున్న మ‌గ‌వాళ్లంతా గ్రామంలోని ఆల‌యంలో ఉన్న ర‌తీమ‌న్మ‌థుల విగ్ర‌హాల‌కు పూజ‌లు చేస్తారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!