డ్రైవ‌ర్ లేకుండా పొలం దున్నుతున్న ట్రాక్ట‌ర్

Share On

ప్ర‌స్తుత రోజుల్లో వ్య‌వ‌సాయం స్పీడుగా, అన్ని ర‌కాలుగా ముందుకు సాగాలంటే ట్రాక్ట‌ర్ చాలా అవ‌స‌రం. అందుకే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ ట్రాక్ట‌ర్‌తోనే వ్య‌వ‌సాయం చేస్తున్నారు. కొన్ని స‌మ‌యాల్లో పొలాల్లో ప్ర‌మాదాలు జ‌రిగి ప్రాణాలు సైతం కొల్పోతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. అందుకే ట్రాక్ట‌ర్‌కు డ్రైవ‌ర్ లేకుండా పొలం దున్నుతూ, వ్య‌వ‌సాయ ప‌నులు చేస్తే అంతకు మించిన ఆనందం రైతుకు ఇంకేం ఉంటుంది. పొలంలో ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర చెట్టుకింద ఉండి రిమోట్‌తో ఆనందంగా వ్య‌వ‌సాయ ప‌నులు చేసుకోవ‌చ్చు. అలాంటి ఆలోచ‌నతోనే ఒక యువ‌కుడు డ్రైవ‌ర్ లేకుండా పొలం ప‌నులు చేసే ట్రాక్ట‌ర్‌ను త‌యారు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

రాజస్థాన్‌కి చెందిన ఈ 19 ఏళ్ల యోగేష్ బీఎస్సీ ఫస్టియర్ చదువుతున్నాడు. ఒక‌సారి యోగేష్‌కి త‌న ఇంటి ద‌గ్గ‌ర నుంచి మీ నాన్న ఆరోగ్యం బాగాలేదు, నువ్వు ఊరికి వ‌చ్చేయ‌ని కాల్ వ‌చ్చింది. హ‌డావుడిగా వెళ్లిన యోగేష్ తండ్రిని చూసుకుంటూ, ట్రాక్ట‌ర్‌తో వ్య‌వ‌సాయ ప‌నులు చేయ‌సాగాడు. అప్పుడే అత‌నికి మనం డ్రైవర్ లెస్ కార్లను త‌యారుచేశాం, అలాంటప్పుడు డ్రైవర్ లెస్ ట్రాక్టర్ ఎందుకు చేయ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌తోనే రిమోట్ కంట్రోల్‌తో నడిచే ట్రాక్టర్‌ను తయారుచేశాడు. త‌న తండ్రికి చెప్పి అత‌ని ద‌గ్గ‌ర 2000 అప్పు తీసుకొని ప్ర‌యోగం ప్రారంభించాడు. అసలు ఇది ఎలా పనిచేస్తుందో ముందు నాకు చూపించు, నీకు సాధ్య‌మ‌ని నిరూపిస్తే, అప్పుడు మ‌రింత డ‌బ్బు ఇస్తాను అని తండ్రి చెప్పాడు. రూ.2వేలు పెట్టి కొన్ని రకాల పరికరాలు కొన్న యోగేష్‌, వాటిని ఉపయోగించి ట్రాక్టర్‌ను ముందుకూ, వెనక్కీ రిమోట్‌తో కదిలించి చూపించాడు. యోగేష్ చెప్పినది సాధ్యమే అని గ్రహించిన తండ్రి తన బంధువుల దగ్గర రూ.50,000 అప్పు చేసి కొడుక్కి ఇచ్చాడు. దాంతో యోగేష్ తన కల నిజం అయ్యేలా పూర్తి స్థాయి పరికరాలతో మంచి రిమోట్ కంట్రోల్ తయారుచేసుకొని, ట్రాక్టర్‌ను అన్ని రకాలుగా రిమోట్‌తో నడిచేలా చేశాడు. డ్రైవ‌ర్ లెస్ ట్రాక్ట‌ర్ చేయ‌డంతో యోగేష్‌ను అంద‌రూ ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!