8కిలోమీట‌ర్లు చ‌క్రాల కుర్చీపైనే ర్యాలీ

Share On

దేశంలో ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగుతున్నాయి. మొద‌టి ద‌శ ఎన్నిక‌ల ముగియ‌గా, రెండో ద‌శ పోలింగ్‌లో భాగంగా గురువారం నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ప‌శ్చిమ‌బెంగాల్ సిఎం మ‌మ‌తా బెన‌ర్జీ నందిగ్రామ్ స్థానం నుంచి బ‌రిలోకి దిగారు. మ‌మ‌తా నందిగ్రామ్‌లో భారీ రోడ్ షో నిర్వ‌హించారు. చ‌క్రాల కుర్చీపైనే కూర్చొని ప్ర‌జ‌ల‌కు అభివాదం తెలుపుతూ 8కిలోమీట‌ర్లు ర్యాలీ నిర్వ‌హిస్తూ ముందుకు సాగారు. ఓటింగ్ ముగిసేదాకా నందిగ్రామ్‌లోనే ఉంటాన‌ని ఆమె తెలిపారు. ఇదే నియోజకవర్గంలో మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ర్యాలీ నిర్వహించనున్నారు. తృణమూల్‌ నుంచి వెళ్లి బీజేపీలో చేరిన సువేందు అధికారి ఇక్కడ మమతకు పోటీగా నిలబడ్డారు. ఇదిలా ఉండగా, 24 పరగణాల జిల్లాలో బీజేపీ కార్యకర్త తల్లి శోభా మజుందార్‌(82) మృతి రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. బీజేపీ కార్యకర్తలు పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వృద్ధురాలిపై ఫిబ్రవరి 27న టీఎంసీ గూండాలు దాడి చేశారని, చికిత్స పొందుతూ ఆమె సోమవారం చనిపోయారని శోభా మజుందార్‌ కుటుంబసభ్యులు తెలిపారు. దీనిని టీఎంసీ ఖండించింది. ఆమె అనారోగ్యంతో చనిపోయి ఉంటారని వెల్లడించింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!