ఆవుపేడ‌, బంక‌మ‌ట్టితో కారును అలంక‌రించి

Share On

ఒక ప‌క్క ఎండ‌లు మండిపోతున్నాయి.. బ‌య‌ట కాలు పెట్టాలంటే చెమ‌ట‌లు కారుతున్నాయి.. కారులో ఏసీ ఉన్నా కూడా ఎండ వేడికి త‌ట్టుకోలేని ప‌రిస్థితి. అందుకే ఒక వ్య‌క్తి వినూత్నంగా ఆలోచించాడు. త‌న కారును చ‌ల్ల‌ద‌నం కోసం ఆవు పేడ‌, బంక‌మ‌ట్టితో అలంక‌రించి ప్ర‌యాణం చేస్తున్నాడు.

కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక‌ వ్యక్తి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చాడు. ఆ కారును చూసిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆవు పేడ, బంక మట్టిని బాగా కలిపి అద్దాలు మినహా కారు మొత్తం పూర్తిగా పూసేశాడు. ఎండలు మండిపోతుండడంతో ఆ వేడి నుంచి కారు ఉపశమనం కల్పించేందుకు ఆవుపేడ పూసిన కారు తీసుకొచ్చాడు. తిరుమల నందరకం పార్కింగ్‌ కంప్లెక్స్‌ దగ్గర ఈ కారును పార్క్ చేశాడు. ఈ కారును అక్కడున్న వారు విచిత్రంగా చూడడం మొదలుపెట్టారు. తర్వాత, ఈ కారును అక్కడే ఉన్న కొందరు భక్తులు ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ వ్యక్తి చర్యపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆవు పేడలో ఉన్న సుగుణాలను వివరిస్తూ అతడి చర్యను సమర్థిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!