సాగ‌ర్‌లో క‌మ‌లం విక‌సించ‌డం క‌ష్ట‌మే

Share On

దుబ్బాక‌లో ఉన్న ఊపు వేరు.. అక్క‌డ బ‌రిలో దిగిన నాయ‌కుడు వేరు.. అధికార‌ప‌క్షంలో ఉన్న‌వారిని మాట‌ల తూటాల‌తో ఆగ‌మాగం చేసి, ప్ర‌జ‌ల్లో ఆలోచ‌న రెకెత్తించే క‌మ‌లం జెండా ఎగుర‌వేశారు. అదే ఆలోచ‌న, ఆదే ఆవేశం, అదే వ్యూహాం అభ్య‌ర్థి ఎంపిక‌లోనే క‌మ‌లం చేజార్చుకున్న‌ట్లు తెలిసిపోతుంది. అభ్య‌ర్థి ఎంపిక‌లోనే క‌మ‌ల నాయ‌కులు త‌ప్ప‌ట‌డుగులు వేసార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దుబ్బాక‌లో జ‌రిగినంత హోరాహోరీ ప్ర‌చారం, మాట‌లు తూటాలు ఇక్క‌డ ప‌ని చేయ‌వ‌ని అర్థ‌మవుతోంది. అభ్య‌ర్ధి ఎవ‌రైనా బిజెపి శ్రేణులంతా ఏక‌మై ప్ర‌చారం చేస్తార‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది.

రాజ‌కీయ చాణ‌క్యుడిగా పేరుగాంచిన కెసిఆర్ ఒక‌టికి రెండు సార్లు ఆలోచించే నాగార్జున‌సాగ‌ర్ టికెట్ దివంగ‌త నోములు న‌ర‌సింహ‌య్య కుమారుడు నోముల భ‌గ‌త్‌కు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర‌స్థాయి నాయ‌కుడిగా పేరుగాంచిన నోముల న‌ర‌సింహ‌మ‌య్య సానుభూతి కూడా ఇక్క‌డ క‌లిసొచ్చే అంశంగా ఉంది. బిజెపిలో ప‌ట్టు ఉన్న నాయ‌కుడిని కాద‌ని అనుకోకుండా తెర‌మీదికి కొత్త‌పేరు తీసుకురావ‌డం ఆ పార్టీకి అతిపెద్ద మైన‌స్‌గా చెపుతున్నారు. ఈ ప్రాంతంపై ప‌ట్టున్న నాయ‌కుడు అంద‌రికి షాకిచ్చి టిఆర్ఎస్‌లో చేర‌డంపై సాగర్ బీజేపీలో కలకలం రేపింది. మరోవైపు సీనియర్ మహిళా నాయకురాలు బీజేపీ నేత డాక్టర్ నివేదితారెడ్డి కూడా బీజేపీ తరఫున సాగర్ టికెట్ ఆశించారు. తనకే టిక్కెట్ వస్తుందని భావించి నామినేషన్ సిద్ధం చేసుకున్నారు. అయితే రవికుమార్ నాయక్‌కు టిక్కెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆమె కూడా టీఆర్ఎస్‌లో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు.

ఈ వరుస పరిణామాలతో సాగర్ విషయంపై బీజేపీ అంతర్మథనంలో మునిగిపోయింది. దుబ్బాకలో అభ్యర్థిని ప్రకటించాక ఒక ఊపు వస్తే, నాగార్జున‌సాగ‌ర్‌లో మాత్రం ప్రతికూల పరిస్థితి ఎదురైంది. దీంతో కేడర్ కూడా చెల్లాచెదురయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికకు కేంద్రం నుంచి పెద్దలు వచ్చి ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్న కార‌ణంగా ఇక్క‌డికి ఎవ‌రెవ‌రు వ‌స్తార‌నేది కూడా తెలియ‌డం లేదు. సాగ‌ర్‌లో మాత్రం దుబ్బాక తరహా దూకుడు మాత్రం ఏ ర‌కంగా చూసినా కనిపించడమే లేదు. స్థానికంగా బ‌లంగా ఉన్న బిజెపి క్యాడ‌రే అధికార‌పార్టీలోకి పోవ‌డంతో క‌నీసం ఓట్లు ఐనా వ‌స్తాయా, లేదా అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. ‌


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!