
2021 ములుగు జిల్లా మేడారంలో జరిగిన మినీ జాతరకు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎంత మేరకు నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో మినీ మేడారం జాతర నిర్వహణ కోసం ఏఏ పనుల కోసం ఎంతెంత ఖర్చు చేశారు. కేటాయించిన నిధులు, చేసిన ఖర్చులను పూర్తి వివరాలను తెలుగులో అందించాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడం జరిగింది. పై సమాచారం అంతా శాఖల వారీగా, పనుల వారీగా తెలుగులో అందించాలని కోరడం జరిగింది.