
దేశంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల్లో ఎన్ని అత్యాచార, లైంగిక వేధింపులు కేసులు నమోదయ్యాయి. మహిళలపై ఇతర యాసిడ్, శారీరక దాడులు ఎన్ని జరిగాయి. ఎంతమంది నిందుతులపై ఎన్ని కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన వారిలో ఎంతమంది జైలుశిక్ష అనుభవిస్తున్నారు. మహిళల అత్యాచారం కేసులో ఎంతమందికి జీవితకాలం, ఎంతమంది ఉరిశిక్ష పడింది. ఎంతమంది బెయిల్ మీద వచ్చి బయట తిరుగుతున్నారు. ఉరిశిక్ష పడి అమలుకాకుండా ఎంతమంది ఉన్నారు. వీరికి సంబంధించిన పూర్తి సమాచారం దేశంలోని రాష్ట్రాల వారీగా ఇవ్వాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడం జరిగింది. పై వివరాలన్నీ తెలుగులో వివరంగా అందించాలని కోరింది.