ఆ కోడి పుంజు ధ‌ర ల‌క్ష నుంచి ఐదు ల‌క్ష‌లు

Share On

ఆ జాతి కోడి పుంజు అంటేనే ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. దాని చూడ‌గానే ఒక ర‌కంగా ఉంటుంది. దాని పెంప‌కంకూడా మంచి శ‌రీరాకృతి క‌లిగి, దృడ‌త్వంతో ఉంటాయి. ఆ జాతి కోడి మ‌న ప్రాంతంలో క‌న‌బ‌డ‌దు. దాని పెంచాలంటే కూడా ఎన్నో ప‌ద్ద‌తులు పాటించాలి. ఆ కోడి పుంజు అయ్యాక దాని న‌మ్మ‌కం కూడా అన్‌లైన్‌లో పెడుతారు. కోడి సైజ్‌ను బ‌ట్టి ఒక్క కోడి ధ‌ర ల‌క్ష నుంచి ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు ధ‌ర ప‌లుకుతోంది.

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామానికి చెందిన యల్‌.జయచంద్రనాయుడు తమిళనాడు నుంచి పర్లా జాతి కోళ్లను తెచ్చి పోషిస్తున్నారు. ఒక షెడ్‌ను ఏర్పాటు చేసి, ఒక్కొక్క కోడికి ఒకో గూడు నిర్మించారు. 30 కోళ్లను సహజ పద్ధతిలో పెంచుతున్నారు. ఎందుకంటే ఈ కోడి అత్యంత కాస్ట్లీ. అందుకని ఈ కోళ్లతో ఉదయాన్నే వ్యాయామం చేయిస్తారు. నీటి తొట్టెలో ఈత కొట్టిస్తారు. బాదంపిస్తా, పప్పు, సజ్జలు, జొన్నలు, రాగుల వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని అందిస్తారు. ఇలా చేయడంతో పర్లా జాతి కోళ్లల్లో మంచి శరీరాకృతి దృఢత్వం, ఆహార్యంలో చక్కదనం వస్తుందని జయచంద్ర తెలిపారు. దాదాపు ఆరు నెలల నుంచి ఏడాదిపాటు వీటిని పెంచిన తర్వాత ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుపుతున్నారు. కోడి అందం, బరువును బట్టి ధర పలుకుతుందని చెప్పారు. కోళ్ల పెంపకందారులతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశాం. అందులో కోళ్ల ఫొటోలు ఉంచుతాం. నచ్చినవారు ఫోన్‌ చేసి కొనుగోలు చేస్తుంటారు. పుంజు కోడి ధర రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు పలుకుతుందని జయచంద్రనాయుడు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పేరుతెస్తున్న పర్లా జాతి కోళ్లు రాజసం ఉట్టిపడేలా అందమైన చిలుకలాంటి ముక్కు, పొడవైన తోకతో ఉంటాయి. అంతేకాదు ఈ కోళ్లను మాంసం కోసమో, పందేల కోసం కాకుండా అందాల పోటీలకు సైతం వినియోగిస్తారు. ఈ కోళ్లు పలు రకాల రంగుల్లో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక వీటి ఒకొక్క గుడ్డు ధర రూ. 1000. ఏడాదికి ఒక్కొక్క కోడి 35 గుడ్లు పెడతాయి. అంతేకాదు అందాల పోటీల్లో పాల్గొని బోలెడు బహుమతులు కూడా గెలుచుకుంటాయి.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!