అక్క‌డ ఉన్న ఓట్లు 90.. పోలైన‌వి 171

Share On

అస్సాంలో జ‌రుగుతున్న శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌రోసారి అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. రెండో విడత ఎన్నికల్లో భాగంగా హాప్లాంగ్‌లో ఏప్రిల్‌ 1న పోలింగ్‌ జరిగింది. స్థానిక ఖోట్లిర్‌ ఎల్‌పీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలోని ఓటర్ల జాబితాలో 90 మంది పేర్లు ఉండగా, ఈవీఎంలో మాత్రం 171 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆ పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వహించిన ఐదుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఏప్రిల్‌ 2వ తేదీనే జారీ అయిన్పటికీ ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఘటన నేపథ్యంలో ఈ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈసీ ఓటర్ల జాబితాను అంగీకరించని స్థానిక గ్రామపెద్ద తమ సొంత జాబితాను తీసుకొచ్చారని, దాని ప్రకారమే అక్కడ ఓటింగ్‌ జరిగిందని అధికారులు చెబుతున్నారు. అందువల్లే జాబితా కంటే ఎక్కువ ఓట్లు పోలైనట్లు తెలిపారు. అయితే గ్రామపెద్ద తెచ్చిన జాబితాను పోలింగ్‌ సిబ్బంది ఎలా అనుమతించారన్నది ఇంకా తెలియరాలేదు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!