బార్లు, పబ్‌లు, థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు ఏవి

Share On

తెలంగాణ‌లో క‌రోనా రోజురోజుకు అత్యంత వేగంగా పెరిగిపోతుంది. కాని రాష్ట్రంలో విచ్చ‌ల‌విడిగా బార్లు, ప‌బ్‌లు, థియేట‌ర్లు న‌డుస్తూనే ఉన్నాయి. వాటిపై ఎందుకు ఆంక్ష‌లు విధించ‌లేదో తెల‌పాల‌ని హైకోర్టు తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు అతితక్కువగా చేస్తున్నారని, పూర్తిగా ర్యాపిడ్‌ టెస్టులపైనే దృష్టి పెట్టారని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 10 శాతం కూడా లేవని ధర్మాసనం పేర్కొంది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని ఏజీ వివరణ ఇవ్వగా రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్తుంటే ఇంకా నెమ్మదిగా పెంచడమేంటని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచాలని స్పష్టం చేసింది. వివాహాలు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కరోనా పాజిటివ్‌, మరణాల రేటు వెల్లడించాలని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా చికిత్స కేంద్రాల వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని, అనాథ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది. కరోనా నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని, నిబంధనలు పాటించనివారిపై నమోదైన కేసులు, జరిమానాల వివరాలు వెల్లడిస్తూ 48గంటల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!