చిన్న‌ప్పుడు త‌ప్పిపోయిన కూతురే… కోడ‌లిగా

Share On

కొన్ని అనుకొని సంఘ‌ట‌న‌లు చూస్తుంటే అస‌లేమి అర్థం కాదు.. ఏలా స్పందించాలో, ఏమి చేయాలో, ఏలాంటి నిర్ణ‌యం తీసుకోవాలో కూడా తెలియదు. బిడ్డ పుట్ట‌గానే అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటే అనుకోకుండా ఆ పాప త‌ప్పిపోయింది. వెతికి, వెతికి ఇంక బిడ్డ దొర‌క‌ద‌ని భావించి వేరో ఒక అబ్బాయిని ద‌త్త‌త తీసుకొని పెంచుకున్నారు. కాని ఇక్క‌డే విధి ఒక నాట‌కం ఆడింది. పెద్ద‌వాడైనా అబ్బాయికి పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి పీట‌ల మీద కూర్చున్న పెళ్లికూతురు చిన్న‌ప్పుడు త‌ప్పిపోయిన తన కూతురు అని తెలిసే స‌రికి ఆ పెళ్లి అవుతుందా, లేదా అనే టెన్ష‌న్ అంద‌రిలో నెల‌కొంది.

చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని సుజౌలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక‌ మహిళ తన కొడుకు పెళ్లికి అంతా సిద్దం చేసింది. మార్చి 31న పెళ్లి ఫిక్స్ చేశారు. అయితే పెళ్లిరోజు ఆ మహిళ వధువు చేతిలో పుట్టమచ్చను గమనించి షాక్ తింది. చాలా ఏళ్ల కిందట తప్పిపోయిన ఆమె కూతురి చేతిలో పుట్టుమచ్చ మాదిరిగానే అనిపించడంతో ఆమె వధువు తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. వధువు గురించి వివరాలు ఆరా తీయడం ప్రారంభించింది. 20 ఏళ్ల కిందట ఈ అమ్మాయిని దత్తత తీసుకున్నారా అంటూ ప్రశ్నించేస‌రికి వారు ఏలాంటి స‌మాధానం చెప్ప‌లేదు. అమ్మాయిని తాము పెంచుకున్నామనే రహస్యం ఆమెకు ఎలా తెలిసిపోయిందని వధువు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అయితే చివరకు ఆ అమ్మాయిని చిన్నతనంలో రోడ్డు పక్కన గుర్తించామని, అప్పటి నుంచి ప్రేమగా పెంచామని వారు తెలిపారు. అయితే ఈ విషయం తెలిసిన వధువు కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత తాను పెళ్లిచేసుకోబోయే వ్యక్తి తల్లే తనకు జన్మనిచ్చిన తల్లి అని తెలుసుకుంది. నిజమైన తల్లిదండ్రులను కలుసుకోవడం తన పెళ్లి రోజు కంటే సంతోషంగా ఉందని వధువు పేర్కొంది.

ఐతే వధువుకు అసలు తల్లిదండ్రులు తెలియడంతో తన అన్ననే పెళ్లాడుతున్నానని ఆమె ఆందోళ చెందింది. అయితే పెళ్లికొడుకు తనకు జన్మించిన వాడు కాదని, తాను దత్తత తీసుకున్నట్టు మహిళ పేర్కొంది. కుమార్తె తప్పిపోయిన తర్వాత ఆమె ఆచూకీ కోసం ఎంతగానో వెతికానని, త‌న బిడ్డ దొర‌క‌క‌పోయేస‌రికి ఈ క్రమంలోనే ఈ అబ్బాయిని దత్తత తీసుకున్నానని చెప్పింది. వారిద్దరు బయోలాజికల్ తోబుట్టువులు కానందున వారి పెళ్లికి సంబంధించి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. ఆ తర్వాత వరుడికి అసలు విషయం చెప్పి వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. ఈ పెళ్లి వేడుక ఆ మహిళా కుటుంబలో రెట్టింపు ఆనందాన్ని నింపిందని పెళ్లికి హాజరైన అతిథులు తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!