
వెంకటాపూర్ మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయాన్ని మంగళవారం ట్రైనీ కలెక్టర్ లు దీపక్ రెడ్డి, దీపక్ తివారి, రిజ్వాన్ భాషా షేక్, ప్రతిమ సింగ్, అంకిత్,హేమంత్ పాటిల్, చిత్ర మిశ్రా, గరెన అగర్వాల్లే సందర్శించి రామప్ప దేవాలయ శిల్ప కళా అద్భుతమని కొనియాడారు. ముందుగా వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ మండపంలో వారికి స్వామి వారి శేష వస్త్రాలు ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్, తాసిల్దార్ మంజుల అందజేశారు. రామప్ప చరిత్రను గోరంట్ల విజయ్ వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామప్ప శిల్పకళ అద్భుతంగా ఉందని నాటి శిల్పుల పనితనానికి ఇది నిదర్శనమని అన్నారు. వారి వెంట టూరిజం మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరావు, లైజన్ ఆఫీసర్ రాంబాబు తదితరులు ఉన్నారు.