నిజాన్ని చూపెట్టే ప్ర‌య‌త్నం కోస‌మే ముందడుగు

Share On

నిజాల‌ను నిర్భ‌యంగా చూపెడుతూ, సమాజంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించేందుకే ముందడుగు నిరంత‌రం ప‌నిచేస్తుంద‌ని ముందడుగు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ రాజేంద్ర పల్నాటి అన్నారు. హైదరాబాద్‌లోని ముందడుగు కార్యాలయంలో ముందడుగు కార్యక్రమాలు, కార్యకలాపాలపై సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలోని అవినీతిపై అవగాహన కల్పిస్తూ, సమాచారహక్కు చట్టం ద్వారా అవినీతిని ప్రశ్నిస్తే, ముందడుగు నీతిగా, నిజాయితీగా పనిచేసే వారిని గుర్తిస్తూ నేటి సమాజానికి వారి అనుభవాలు, కష్టాలు, కన్నీళ్లను పరిచయం చేస్తుందన్నారు. నిజాలను బయటికి తీస్తూ, నిజాయితీగా బతికే వారికి మద్దతుగా నిలబడుతుందన్నారు. ముందడుగు పౌండేషన్ ప్రారంభం సంధర్బంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కొమటి రమేశ్ బాబు, కొన్నె దేవేందర్, దేవిరెడ్డి. స్వప్నారెడ్డి, మంత్రి భాస్కర్, సూర్య, రాజేష్, రమేశ్, రత్నాకర్, ఆఫీస్ ఇంచార్జ్ ప్రవీణ్, ముందడుగు ప్రత్యేక బృందం తదితరులు పాల్గొన్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!