
అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి.. ఇప్పటి సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న వాతావరణం, బిజీ జీవితం దృష్ట్యా మనుషులు కూడా లావు పెరుగుతున్నారు. పెరిగిన బరువు తగ్గడానికి ప్రజలు పడుతున్న కష్టాలు అన్ని, ఇన్ని కావు. కొంతమంది ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతే, మరికొంతమంది విపరీతంగా వ్యాయామం చేస్తుంటారు. ఎలాగైనా బరువు తగ్గాలని ఇరవై నాలుగు గంటలు కఠిన నియమాలు చేసేవారు ఉంటారు. కాని ఒక వ్యక్తి మాత్రం ప్రతి రోజు బీరు తాగి 18కేజీల బరువు తగ్గాడు.
అమెరికాకు చెందిన ఒక వ్యక్తి రోజూ బీర్ తాగి ఏకంగా 18 కిలోల బరువును కోల్పోయాడు. సిన్సినాటి నగరంలో నివసిస్తున్న డేల్ హాల్ అనే వ్యక్తి బరువు తగ్గడంలో భాగంగా ప్రతీ రోజూ టీ, కాఫీ, బీర్, వాటర్ మాత్రమే తాగాడు. ఆకలి వేసినప్పుడల్లా బీర్ తాగి బరువు తగ్గించుకున్నాడు. రోజుకు 2 నుండి 5 సార్లు బీర్ తాగాడు. కొంచెం తేలికపాటి ఆహారం అయిన పచ్చని కాయగూరలు మాత్రమే తినడం ద్వారా 18 కిలోగ్రాముల బరువును తగ్గానని చెప్పుకొచ్చాడు. ఈ డైట్‌ను సుమారు 47 రోజులు అనుసరించడం ద్వారా 18 కిలోల బరువు తగ్గినట్లుగా డేల్ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు. అలాగే బరువు తగ్గే క్రమంలో తాను ఫాలో అయిన డైట్ ప్రక్రియను సైతం నెటిజన్లతో పంచుకున్నాడు.