రాత్రికి రాత్రే ఆ గ్రామ‌స్థులు కోటీశ్వ‌రుల‌య్యారు

Share On

ఎవ‌రి అదృష్టం ఎప్పుడు ఏలా మారుతుందో తెలియ‌దు.. ప్ర‌తి ఒక్క‌రికి జీవితంలో ఏదో ఒక టైం వ‌స్తుందంట.. అది అంద‌రిలో నిజ‌మో, కాదో తెలియ‌దు కాని ఒక గ్రామంలోని ప్ర‌జ‌లంద‌రికి వారంతా ఒకే రోజు రాత్రి కోటీశ్వ‌రుల‌య్యే అవ‌కాశం వ‌చ్చింది.

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో బొమ్జా అనే గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజలు ఒక్క రోజులోనే ధనవంతులు అయిపోయారు. కోట్ల రూపాయలు అందుకుని కోటీశ్వరులుగా నిలిచారు. బొమ్జా గ్రామంలో 200 ఎకరాల భూమిని రక్షణ మంత్రిత్వ శాఖ 2018 ఫిబ్రవరి నెలలో స్వాధీనం చేసుకుంది. ఈ గ్రామంలో మొత్తం 31 కుటుంబాలు నివసిస్తుండగా వారి భూములు తీసుకున్నందుకు గానూ కేంద్ర ప్రభుత్వం వారికి రూ .41 కోట్లు పరిహారంగా ఇచ్చింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ భూమిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూమిని తీసుకున్నందుకు పరిహారంగా గ్రామంలో నివసిస్తు్న్న కుటుంబాలన్నింటికీ పరిహారం చెల్లించారు. అధికారిక లెక్కల ప్రకారం ఒక కుటుంబానికి గరిష్ఠంగా రూ.6.73 కోట్లు చెల్లించగా మరో కుటుంబానికి రూ. 2.44 కోట్లను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ చెల్లించింది. ఇక మిగిలిన 29 కుటుంబాలకు రూ. 1.09 కోట్ల చొప్పున పరిహారం అందజేశారు. అలా పరిహారాన్ని అందుకున్న గ్రామస్తులు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!