వాళ్లు న‌న్ను కాపాడే అన్న‌య్య‌లు కాదు.. కామాంధులు

Share On

చిన్న ఆప‌ద వ‌చ్చినా, కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన అన్న‌య్య‌లే లైంగికంగా వేధిస్తూ ప‌లుమార్లు అత్యాచారం చేశార‌ని, వాళ్లు అన్న‌య్య‌లు కాద‌ని కామాంధుల‌ని ఒక యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఇదే విష‌యం క‌న్న‌త‌ల్లికి చెప్పినా, పెద్ద దిక్కుగా ఉండే పెద్ద‌మ్మ‌కు, పెద‌నాన్న‌ల‌కు చెప్పినా ఏమాత్రం ప‌ట్టించుకోక‌పోక ఇదంతా కామ‌న్ అని అంటున్నారని రోదిస్తూ తెలిపింది. గొప్ప‌గా చ‌ద‌వాల‌నుకునే న‌న్ను చిత్ర‌హింస‌లు పెడుతున్నార‌ని వారిని శిక్షించి, నాకు న్యాయం చేయాల‌ని వేడుకోంది.

కొత్తగూడెం రెండో పట్టణ ఇన్‌స్పెక్టర్‌ బత్తుల సత్యనారాయణ కథనం ప్రకారం బాధిత యువతి చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. కుటుంబ బాధ్యతలన్నీ తల్లి చూసేది. ఆమె చిన్నతనంలో వీరి కుటుంబం మణుగూరులో ఉండేది. ఆమె 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే (2009) సొంత అన్నయ్య ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. కొన్నేళ్ల క్రితం అతడికి ఉద్యోగం రావటంతో కొత్తగూడేనికి వచ్చారు. ఆమె పెద్దదైనా అతడు అలాగే వ్యవహరిస్తున్నాడు. అతడి హింసలు భరించలేక ఇంటర్‌ చదివే సమయంలో కొత్తగూడెంలోనే ఉన్న పెద్దమ్మ ఇంటికి వెళితే అక్కడ వరసకు అన్నయ్య అయిన వాళ్ల కుమారుడు ఆమెపై లెంగికదాడికి దిగాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. తల్లి, పెద్దమ్మ, పెదనాన్నలకు చెప్పినా పట్టించుకోకపోగా నీచంగా మాట్లాడేవాళ్లు. మెడిసిన్‌ ఎంట్రన్స్‌ శిక్షణ నిమిత్తం ఇటీవల వేరే ప్రాంతానికి వెళ్లినా లాక్‌డౌన్‌ సమయంలో మళ్లీ ఇంటికి చేరక తప్పలేదు. అప్పుడూ అన్నయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో కొన్ని రోజుల వరకు వారికి దూరంగా ఉన్నా మళ్లీ సెలవులు ఇవ్వడంతో తిరిగి కొత్తగూడేనికి వచ్చిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు అన్నయ్యలతోపాటు తల్లి, పెద్దమ్మ, పెద్దనాన్న నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!