పోలీస్ అధికారిని చిత‌క‌బాదిన జ‌నం

Share On

పెరుగుతున్న జ‌నాభా దృష్ట్యా విచ్చ‌ల‌విడిగా పెరుగుతున్న ట్రాఫిక్‌.. గ‌మ్యస్థానానికి ఏలా చేరాలో తెలియ‌క చాలా మంది ట్రాఫిక్‌లో న‌ర‌కం చూస్తున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన అధికారులు ట్రాఫిక్ సిగ్న‌ల్స్ ద‌గ్గ‌రే తనిఖీలు చేస్తున్నారు. ఇంత ట్రాఫిక్‌లో ఈ త‌నిఖీలు ఏంద‌ని ప్ర‌శ్నించిన వ్య‌క్తిపై పోలీసులు దాడి చేయ‌డంతో అది త‌ట్టుకోలేని జ‌నం పోలీస్ అధికారిని న‌డిరోడ్డుపై చిత‌క‌బాదారు.

ఢిల్లీ ఐఐటీ సమీపంలో హౌజ్ ఖాస్ ప్రాంతంలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఢిల్లీ సివిల్ డిఫెన్స్‌కు చెందిన పోలీసు సిబ్బంది సోమవారం (ఏప్రిల్ 5) సాయంత్రం మాస్క్ చెకింగ్ డ్రైవ్ చేపట్టారు. ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ డ్రైవ్ నిర్వహించారు. ఇంతలో అటుగా వచ్చిన ఓ కారును పోలీసులు నిలువరించారు. ఆ కారును నడుపుతున్న గీతేశ్ దాగర్ (20) సడెన్‌గా బ్రేకులు వేయడంతో.. వెనకాల వచ్చిన మరో కారు అతడి వాహనాన్ని ఢీకొట్టింది. కారు నుంచి బయటకు దిగిన గీతేశ్ దాగర్.. పోలీసుల వద్దకెళ్లి సిగ్నల్ వద్ద తనిఖీలేంటని నిలదీశాడు. దీంతో పోలీసులకు అతడికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాసేపటి తర్వాత ఒక‌ పోలీసు అధికారి గీతేశ్ దాగర్‌ను బెల్ట్‌తో విచక్షణారహితంగా కొట్టడం ప్రారంభించాడు. తోటి సిబ్బంది నిలువరిస్తున్నా, అక్కడే ఉన్న వాహనదారులు వద్దని అభ్యర్థిస్తున్నా అతడు వినిపించుకోలేదు. అతడి చర్య జనానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో కొంత మంది వ్యక్తులు ఆ అధికారిని రోడ్డు మీద పడేసి చితకబాదారు.

ఎంతగా చెప్తున్నా వినకుండా ఆ అధికారి నడిరోడ్డుపై బెల్ట్‌తో గీతేశ్‌ని బాదుతూనే ఉండటంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌లో చిక్కుకుని ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆగ్రహంతో ఆ అధికారి మీద దాడి చేశారు. ఈ ఘటనలో సదరు పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. సహచర సిబ్బంది అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై దక్షిణ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌ స్పందించారు. సదరు అధికారితో పాటు కారు నడుపుతున్న విద్యార్థి‌ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. సమగ్ర దర్యాప్తు చేయించి తప్పు ఎవరిదైతే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!