బ‌ల్లులు, బొద్దింక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు

Share On

మన ఇంట్లో ఒక బొద్దింక క‌న‌బ‌డితే చాలు.. ఆడ‌వాళ్లు హ‌డ‌లిపోతారు.. మ‌గవాళ్లు దాన్ని చంపేవర‌కు వ‌దిలిపెట్ట‌రు. గోడ‌మీద బ‌ల్లులు ఉన్నా అంతే.. ఒక వేళ బల్లి మ‌న శ‌రీరం మీద ప‌డితే వెంట‌నే స్నానం చేసి ఎన్నో నియ‌మాలు ఆచ‌రిస్తారు. కాని ప‌రాయి దేశం చైనాలో మాత్రం బ‌ల్ల‌లు, బొద్దింక‌లను పెంచే ప‌రిశ్ర‌మ‌లు వేల సంఖ్య‌లో ఉన్నాయి. వాటి పెంప‌కం ద్వారా ప్ర‌తి నెల ల‌క్ష‌ల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. చైనా దేశంలో బొద్దింకలు ఇంట్లో ఉంటే చాలు, లాఫింగ్ బుద్దా ఇంట్లోకి న‌డుచుకుంటూ వ‌చ్చిన‌ట్లేన‌ని, త‌మ క‌ష్టాలు, స‌మ‌స్య‌లు తీరిన‌ట్లేన‌ని చైనీయులు తెగ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తారు.

ఇప్పుడు చైనాలో బ‌ల్లులు, బొద్దింక‌ల పెంప‌క ప‌రిశ్ర‌మ‌లే ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారిపోయింది. ఒక్కొక్క ప‌రిశ్ర‌మ‌లోనూ ప‌ది ల‌క్షల బొద్దింక‌ల‌ను పెంచుతున్నారు. చైనాలో భారీ ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న బొద్దింకలంటే వారికి చాలా ఇష్టం. బొద్దింకల్ని పలు ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. గుండె జబ్బులు, టీబీ, రక్త నాళాలకు సంబంధించిన జబ్బులను నివారించడానికి ఉపయోగించే ఔషధాల తయారీలో బొద్దింకలను ఉపయోగిస్తున్నారు. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ ఉండడంతో చైనాలో ఈ బొద్దింకల పెంపకం మంచి లాభసాటి వ్యాపారంగా మారింది. లక్షల సంఖ్యలో బొద్దింకల్ని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చైనాలో బొద్దింకలను ఎంతో ఇష్టంగా ఆహారంగా కూడా తీసుకుంటార‌నే విష‌యం ప్ర‌పంచ వ్యాప్తంగా తెలిసిందే..


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!