వ‌రుడు రెండు అడుగులు.. వ‌ధువు నాలుగు అడుగులు

Share On

ఇష్టం ఉండాలే కాని మ‌నిషి ఏలా ఉన్నా న‌చ్చుతాడు.. మ‌న‌సులో ఇష్టం లేకుంటే ఎంత గొప్ప‌వాడైనా, ఎంతటి అంద‌గ‌త్తె ఐనా ఇష్టం ఉండదు. మ‌నం నిత్యం ఎన్నో వివాహాలు చూస్తూ ఉంటాం కాని ఒక వివాహం మాత్రం ఆ దేవుడే ద‌గ్గ‌రుండి చేశాడెమో అని అనిపిస్తోంది. ఆ వివాహం గురించి అంద‌రూ ఆస‌క్తి తిల‌కిస్తూ ఆ వ‌ధువ‌రుల‌ను క‌ల‌కాలం నిండు నూరేళ్లు ఆనందంగా దీవిస్తున్నారు. ఇంత‌కీ ఆ వివాహం ప్ర‌త్యేక‌తం ఏంటంటే అక్క‌డ వివాహం చేసుకున్న వ‌రుడు రెండు అడుగులు.. వ‌ధువు నాలుగు అడుగులు ఉండ‌ట‌మే..

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో జరిగింది. ఈ పెళ్లిని చూసినవారంతా జంట చూడముచ్చటగా ఉందంటూ దీవించారు. ముమ్మిడివరం స్థానిక చర్చిలో జరిగిన ఈ వివాహం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుడు దేవరపల్లి శ్రీనివాస్ బాల్యం నుంచే ఎత్తు పెరగడం ఆగిపోయింది. శ్రీనివాస్ కేవలం రెండు అడుగులు మాత్రమే ఉండటంతో ప్రజలు ఎలా పెళ్లి చేసుకుంటాడోనని పేర్కొనేవారు. కానీ శ్రీనివాస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అతని కుటుంబం సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇదే జిల్లా సమనస గ్రామంలో నివసించే సత్య దుర్గ శ్రీనివాస్, ఆయన కుటుంబానికి నచ్చింది. సత్య దుర్గ పొడవు కూడా నాలుగు అడుగులే.. సత్య దుర్గ ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకుంది. ఇద్దరు మనసులు కలవడంతో పెద్దలు మార్చి 31 న శాంతినగర్‌లో వివాహం జరిపించారు. ఈ వివాహాన్ని చూసినవారంతా జంట చూడముచ్చటా ఉందంటూ దీవించారు. ప్రస్తుతం ఈ జంట సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి దీవెనలు పొందుతోంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!