మాస్క్ వాడ‌నందుకు 258మంది జైలుకు

Share On

దేశ‌వ్యాప్తంగా క‌రోనా ప‌లు రాష్ట్రాల‌ను వ‌ణికిస్తోంది.. ప్ర‌తి రోజు ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌త సంవ‌త్స‌రం కంటే వైర‌స్ వ్యాప్తి అధికంగా ఉండ‌డంతో ఏం చేయాలో అర్థంకాక కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. క‌రోనా వైర‌స్ నివార‌ణ‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకొంది. ప్ర‌భుత్వం సూచించిన నివార‌ణ చ‌ర్య‌లు పాటించ‌కుండా మాస్క్ ధ‌రించ‌ని వారిపై ఇండోర్‌ నగరంలో 258 మందిని పోలీసులు తాత్కాలిక జైలుకు పంపించారు. మాస్కులు ధరించని వారిపై ఇండోర్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. స్నేహలతాగంజ్‌ ప్రాంతంలోని ఒక‌ అతిథి గృహాన్ని తాత్కాలిక జైలుగా మార్చి అందులో పెడుతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించే వారిని గుర్తించి, సీఆర్పీసీ సెక్షన్‌ 151 కింద వారిని అదుపులోకి తీసుకుని తాత్కాలిక జైలుకు తరలిస్తున్నారు. జైలుకు తరలించిన వారిని కౌన్సిలింగ్‌ ఇచ్చిన తర్వాత కొంత సమయానికి విడుదల చేస్తున్నట్లు ఒక‌ అధికారి తెలిపారు. ఈ జైల్లో 15 మంది పోలీస్‌ సిబ్బందిని, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి ప్రభావం మధ్యప్రదేశ్‌లోనూ భారీగానే కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 3,722 కేసులు నమోదు కాగా, అందులో 805 కేసులు ఇండోర్‌ నగరంలోనే నమోదయ్యాయి. జిల్లాలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 15శాతం ఉంది. నిత్యం కేసుల సంఖ్య పెరుగుతోందని ఇండోర్‌ కొవిడ్‌ నోడల్‌ అధికారి అమిత్‌ వెల్లడించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!