గున్న ఏనుగును భుజాల‌పై మోసుకెళ్లిన అధికారి

Share On

ఏనుగు అంటే ఏలా ఉంటుంది.. ఒక చిన్న కొండ‌లా ఉంటుంది. అప్పుడే పుట్టిన చిన్న ఏనుగు కూడా ఇంచుమించుగా 50 లేదా 60 కిలోలు వ‌ర‌కు ఉంటుంద‌ని చెపుతున్నారు. కాని త‌ల్లి ఏనుగు నుంచి విడిపోయి బురద కాలువ‌లో ప‌డిన ఏనుగును ఒక అట‌వీ శాఖ అధికారి బ‌య‌టికి తీసి త‌న భుజాల‌పై ఎత్తుకొని ఆసుప‌త్రికి తీసుకెళ్లాడు.

తమిళనాడులోని మెట్టుపాల్యం అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక‌ గున్ను ఏనుగు తల్లి నుంచి విడిపోయింది. అనంతరం ఆడుకుంటూ వెళ్లి పెద్ద కాల్వలో పడిపోయింది. కాల్వ మొత్తం బురదతో నిండిపోవడంతో అందులో కూరుకుపోయి అల్లాడిపోయింది. ఏనుగు ప‌డుతున్న బాధ‌ను చూసి కొందరు ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పళనిసామి శరత్‌కుమార్ అనే ఫారెస్ట్ గార్డ్ అక్కడికి చేరుకొని ఏనుగును కాపాడాడు. దాన్ని భుజాలపై ఎక్కించుకొని అడవుల్లో పరుగులు పెట్టాడు. అనంతరం వైద్య చికిత్స అందించి ప్రాణాలు కాపాడాడు. వాస్తవానికి ఈ వీడియో పాతదే. కానీ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరోసారి వైరల్‌గా మారింది. ఏప్రిల్ 4న పోస్ట్ చేసిన ఏనుగు వీడియోను ఇప్పటి వరకు 8వేల మందికిపైగా వీక్షించారు. ఆ ఫారెస్ట్ గార్డ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. నిజంగా నువ్వు బాహుబలివి అంటూ ఆకాశానికెత్తుతున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!