చిన్నారుల‌ను సైతం వ‌ద‌ల‌ని క‌రోనా

Share On

భార‌త్‌లో క‌రోనా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రికి వ్యాప్తిస్తోంది. క‌రోనా విజృంభ‌ణ అత్యంత వేగంగా కొన‌సాగుతూనే ఉంది. గ‌త సంవ‌త్స‌రం పెద్ద‌ల‌పై విరుచుకుప‌డినా క‌రోనా, సెకండ్ వేవ్‌లో మాత్రం చిన్నారుల‌పై కూడా సోకుతోంది. నెల‌రోజుల వ్య‌వ‌ధిలోనే దేశ‌వ్యాప్తంగా 79,688 మంది చిన్నారుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

మార్చి 1 నుంచి ఏప్రిల్ 4వ తేదీ మ‌ధ్య‌లో ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే 60,684 మంది చిన్నారుల‌కు క‌రోనా సోకింది. ఇందులో ఐదేళ్ల లోపు చిన్నారులు 9,882 మంది ఉండ‌గా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 5,940 మంది పిల్ల‌ల‌కు క‌రోనా వ్యాప్తి చెంద‌గా, 922 మంది చిన్నారులు ఐదేళ్ల లోపు వారు ఉన్నారు. క‌ర్ణాట‌క‌లో 7,327(ఐదేళ్ల లోపు చిన్నారులు 871), ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 3,004(ఐదేళ్ల లోపు చిన్నారులు 471) మంది పిల్ల‌ల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ ఇదే ప‌రిస్థితి ఉంద‌ని రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రి వైద్యులు తెలిపారు. ఢిల్లీలో 2,733 మంది పిల్ల‌లు క‌రోనా బారిన ప‌డ‌గా, ఐదేళ్ల లోపు చిన్నారులు 441 మంది ఉన్నారు. అయితే క‌రోనా సోకిన చిన్నారుల్లో అత్య‌ధికులు పేద‌రికం నుంచి వ‌చ్చిన వారే ఉన్నారు. ఇక చిన్న పిల్ల‌ల‌కు ఆస్ర్టాజెనీకా టీకా అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ, దాని వ‌ల్ల చిన్నారుల్లో బ్ల‌డ్ క్లాటింగ్ అవుతుండ‌టంతో ఆ టీకాను నిలిపివేశారు. యూర‌ప్‌లో ఈ టీకా తీసుకున్న చిన్నారుల్లో ఏడుగురు చ‌నిపోయారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!