యువకుడికి బెదిరింపులు.. యువ‌తిపై అత్యాచారం

Share On

యువ‌తి, యువ‌కులు ఇద్ద‌రూ ములుగు జిల్లాలో అట‌వీ ప్రాంతంలో ప్ర‌కృతి అందాల‌ను తిల‌కించేందుకు బైక్‌పై వెళ్లారు. ప‌చ్చ‌ని చెట్లు, అడ‌విని చూస్తూ వెళ్తున్నారు. అడ‌వి మ‌ధ్య‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు వారిని ఆపి, బెదిరించి వారి ద‌గ్గ‌ర ఉన్న ఫోన్ లాక్కోవ‌డ‌మే కాకుండా యువ‌తిని ఎత్తుకెళ్లి, సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ సంఘ‌ట‌న ములుగు జిల్లా తాడ్వాయిలో జ‌రిగింది.

ములుగు జిల్లా ఎస్‌ఎస్‌.తాడ్వాయి మండలంలోని పర్యాటక స్థలమైన బ్లాక్‌బెర్రీ ఐలాండ్‌ అటవీ ప్రాంతానికి మార్చి 30న ఒక‌ జంట బైక్‌పై వచ్చారు. వీరిని గమనించిన బొట్టాయిగూడెంకు చెందిన కోల సాత్విక్‌ అలియాస్‌ సైదులు, జనగామ ఆనందరావు అటకాయించి యువకుడిని కొట్టి మొబైల్ లాక్కున్నారు. బైక్‌ టైర్లలో గాలి తీసేశారు. అనంతరం యువతిని బెదిరించి తమ బైక్‌పై బలవంతంగా తీసుకెళ్లారు. ఒక‌ చోట యువతిని బెదిరించి సాత్విక్ లైంగిక దాడికి పాల్పడగా ఆనందరావు సహకరించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడిన నిందితులు ఆమెను స్వగ్రామంలో వదిలేసి వెళ్లిపోయారు. అత్యాచారం చేస్తుండగా వీడియో తీశామని, ఈ విషయం ఎవరికైనా చెబితే దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామని నిందితుడు బెదిరించడంతో యువతి భయపడి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. యువతిని బెదిరించారు. చివరికి ఆమె స్నేహితుడు ధైర్యం చేసిన ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు వివరాలన్నీ సేకరించి శనివారం ఉదయం కాటాపూర్‌ క్రాస్‌ వద్ద వారిద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!