గూగుల్ మ్యాప్ న‌మ్మ‌కుంటే వ‌ధువు మారింది

Share On

పెళ్లికొడుకు పెళ్లి మండ‌పం వెళ్ల‌డానికి సిద్ద‌మ‌య్యాడు. పెళ్లి మండ‌పం అడ్ర‌స్ తెలియ‌క గూగుల్ మ్యాప్‌ను న‌మ్ముకున్నాడు. మ్యాప్ ఆధారంగా వెళ్లిన వ‌రుడు, త‌న పెళ్లి మండ‌పానికి వెళ్లిపోయి వేరే పెళ్లి మండ‌పానికి వెళ్లాడు. తీరా అక్క‌డికి వెళ్లాక అంద‌రూ కొత్త‌గా క‌నిపించేస‌రికి తెలియ‌క వ‌చ్చాన‌ని తెలుసుకొని మ‌ళ్లీ తాను పెళ్లి జ‌ర‌గ‌బోయే మండ‌పానికి వెళ్లాడు. గూగుల్ మ్యాప్‌ను న‌మ్మకుంటే ఇంత ప‌ని చేసింద‌నుకుంటు వెన‌క్కి వెళ్లిపోయారు.

ఇండోనేసియాలో జరిగిన ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. సెంట్రల్‌ జావాలోని లొసారి హామ్లెట్‌లో వధువు ఇంటికి బయలుదేరిన వరుడు, అతని బంధువులు గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకున్నారు. అది అక్కడికి సమీపంలోనే ఉన్న జెంగ్‌కోల్‌ హామ్లెట్‌ అనే మరో గ్రామానికి తీసుకెళ్లింది. అక్కడా ఓ పెళ్లిమండపం, హడావుడి ఉండటంతో సరాసరి అందులోకి వెళ్లారు. నిజానికి అక్కడ మారియా అనే అమ్మాయికి బుర్హాన్‌తో అనే యువకుడితో నిశ్చితార్థం జరగాలి. వారంతా బుర్హాన్‌ బంధువుల కోసం చూస్తుండగా గూగుల్‌ బృందం వచ్చేసింది. కాసేపు అంతా సవ్యంగానే జరుగుతోందని అందరూ అనుకున్నారు. అయితే ఏకంగా పెళ్లిదుస్తులు, సరంజామాతో వచ్చిన వారిని చూసి మారియా అప్రమత్తమైంది. వచ్చినవారు తన కోసం వచ్చిన వారు కాదని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. వచ్చినవారు కూడా తాము మరోచోటకు వచ్చినట్టు గుర్తించారు. అక్కడినుంచి బయలుదేరి అసలు పెళ్లిమండపానికి వెళ్లారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!