బ్యాంకులోనే మ‌హిళా మేనేజ‌ర్ ఆత్మ‌హ‌త్య

Share On

ఉద‌య‌మే విధులు నిర్వ‌హించేందుకు వ‌చ్చిన మ‌హిళా ఉద్యోగి బ్యాంకులోని ఒక సంఘ‌ట‌న చేసి షాక్ గురైంది. అదే బ్యాంకులో ప‌నిచేస్తున్న మ‌హిళా మేనేజ‌ర్ ఉరికి వేలాడుతూ క‌నిపించింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై అలారం నొక్కెయ‌డంతో చుట్టుప‌క్క‌ల స్థానికులు, బ్యాంకు సిబ్బంది ప‌రుగున వ‌చ్చి ఆ మేనేజ‌ర్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించినా లాభం లేకుండా పోయింది.

కన్నూరు జిల్లా కుతుపరంబా పరిధిలోని తొక్కిలంగడి కెనరా బ్యాంకులో కె.స్వప్న(38) మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె అనూహ్యంగా బ్యాంకులోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. రోజు మాదిరిగానే ఉదయాన్నే బ్యాంకుకి వచ్చిన మహిళా ఉద్యోగి లేడీ మేనేజర్ ఉరేసుకుని ఉండడం చూసి భయపడిపోయింది. వెంటనే బ్యాంకు అలారం నొక్కి అందరినీ అప్రమత్తం చేశారు. స్థానికులు, బ్యాంకు సిబ్బంది వచ్చి ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. లేడీ మేనేజర్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు రోజు బ్యాంకు ముగిసిన అనంతరం సిబ్బంది ఇంటికెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం ఆమె శవమై కనిపించారు. ఆ రాత్రి ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యాంకు మేనేజర్‌ గదిని పరిశీలించగా ఆమె డైరీ కనిపించింది. అందులో పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నట్లు రాసి ఉందని చెబుతున్నారు. బ్యాంకు సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. త్రిసూర్ జిల్లాకు చెందిన స్వప్న తన ఇద్దరు పిల్లలతో కలసి కన్నూర్‌లోని నిర్మలగిరిలో నివాసం ఉంటున్నారు. ఆమె 2020లో తొక్కిలంగడి బ్రాంచ్‌కి బదిలీపై వచ్చినట్లు తెలుస్తోంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!