అత‌నికి తొమ్మిది మంది భార్య‌లు.. చివ‌ర‌కు

Share On

త‌న తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వ‌లేద‌ని కోపంతో క‌న్న‌కొడుకే క‌న్న‌తండ్రిని అత్యంత దారుణంగా చంపేశాడు. మ‌ద‌న‌ప‌ల్లెకు చెందిన కుందాని భాస్క‌ర్ ఎవ‌రైనా చ‌నిపోతే ఆ మృత‌దేహాల‌ను తీసుకెళ్లి ఖ‌న‌నం చేస్తాడు.
ఇతనికి 9 మంది భార్యలు, 14 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఎనిమిదవ భార్య ఉషారాణిని 12 ఏళ్ల క్రితం హత్య చేసి భాస్కర్‌ జైలుకు వెళ్లాడు. కొంతకాలానికి బయట కొచ్చిన అతను కలకడకు చెందిన ఆదెమ్మను పెళ్లి చేసుకున్నాడు. అక్కడికే మకాం మార్చి గుజిరీ సేకరించి వచ్చే ఆదాయంతో జీవిస్తున్నాడు. అయితే కన్నబిడ్డలను ఏ మాత్రం పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలో రెండవ భార్య ప్రభావతి కొడుకు దినేష్‌ (23) చలపతిరావు కాలనీలో తండ్రి పేరిట ఉన్న 8 సెంట్ల ఆస్తిలో తనకూ భాగం పంచాలని తండ్రిని ఒత్తిడి చేశాడు. తాను త్వరలో మదనపల్లెకు వస్తానని, ఆ రోజే దీనిపై మాట్లాడుతానని నచ్చ జెప్పాడు. ఆదివారం రాత్రి మదనపల్లెకు వచ్చిన భాస్కర్, చలపతిరావు కాలనీలోని తన పాత ఇంటిలో ఒంటరిగా ఉండటం చూసి దినేష్‌ తన అనుచరులతో వెళ్లి ఆస్తి పంపకం విషయమై నిలదీశాడు. అతను పంచేందుకు అంగీకరించకపోవడంతో ఆగ్రహించాడు. కత్తితో దాడిచేసి, గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో తన తండ్రి చనిపోయాడని భావించి పరారయ్యాడు. కొంతసేపటికి తేరుకున్న భాస్కర్‌ రామ్‌నగర్‌లో ఉన్న మరో కొడుకు వద్దకు వెళ్లి స్పృహ కోల్పోయాడు. వారు హుటాహుటిన అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందుకున్న సీఐ, ఎస్‌ఐలు ఆస్పత్రికి చేరుకుని ప్రాధమిక విచారణ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!