1300 ఓట్ల తేడాతో ఓడిపోయిన క‌మ‌ల్‌హాస‌న్‌

Share On

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు చాలా ఉత్కంఠ రేపాయి. మక్కల్‌ నీది మయ్యమ్‌ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ ఓడిపోయాడు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్‌ సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ ‌(బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో ఎమ్‌ఎన్‌ఎం చీఫ్ కమల్‌హాసన్ ఓడిపోయారని ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి వసతి శ్రీనివాసన్‌పై కమల్‌హాసన్ పరాజయం పొందాడు. కాగా కమల్‌మాసన్‌ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి మూడో కూటమిగా ఏర్పడింది. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్‌ హాసన్‌ ప్రకటించుకున్నారు. అయితే చివరకు ఆయన ఓడిపోవడం షాకింగ్‌కు గురి చేసే అంశం. ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా వారందరూ పరాజయం పొందారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!