తోపుడు బండిపై తీసుకెళ్లి త‌ల్లి అంత్య‌క్రియలు

Share On

స‌మ‌యానికి అంబులెన్స్ లేక‌.. ఉన్న అంబులెన్స్‌లు అధికంగా డ‌బ్బులు అడ‌గడంతో ఏమి చేయాలో తోచ‌క చ‌నిపోయిన త‌ల్లి శ‌వాన్ని అంతిమ సంస్కారాల కోసం కుమారులు మాతృదినోత్సవం రోజు తోపుడు బండిపై తీసుకెళ్లిన అమాన‌వీయ సంఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని ఝహల్వార్‌లో జ‌రిగింది.

ఝ‌హ‌ల్వార్‌కు చెందిన ఒక‌ మహిళకు కొద్దిరోజుల క్రితం కరోనా సోకగా.. పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందారు. అయితే ఆమెకు కనీసం అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అక్కడి అధికారులు తిరస్కరించారు. ఆమె కుమారులు, బంధువులు ఎంత వేడుకున్నా అధికారుల మనసు కరగలేదు. కనీసం మృతదేహాన్ని శ్మశానం వద్దకు తరలించేందుకు అంబులెన్సును కూడా అనుమతించలేదు. గ్రామస్థులు కూడా కుటుంబీకులకు సహకరించలేదు. ఇక చేసేదేం లేక నిస్సహాయ స్థితిలో ఇద్దరు కుమారులు తమ తల్లి మృతదేహాన్ని తోపుడు బండిపై ఉంచి అంతిమయాత్ర చేపట్టారు. దాదాపు 3 కిలోమీటర్లు ఉన్న శ్మశానవాటికకు తోపుడుబండిపైనే తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!