ర‌ష్యాలోని పాఠ‌శాల‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్పులు

Share On

రష్యాలోని ఒక‌ పాఠశాలపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది విద్యార్థులు ఉన్నారు. చాలా మంది విద్యార్థులను బందీలుగా చేసుకున్నారు. వీరిని విడిపించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఇద్దరు వ్యక్తులను భద్రతా దళాలు కాల్పిచంపినట్లు వార్తలు వచ్చాయి.

రష్యాలోని కజాన్ నగరంలో మంగళవారం ఉదయం ఒక పాఠశాలలోకి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 13 మంది మరణించారు. మరణించిన వారిలో 8 మంది పిల్లలు, ఒక‌ ఉపాధ్యాయుడు ఉన్నారు. పాఠశాలలో పేలుడు, కాల్పులతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. పెద్ద ఎత్తున పొగ వెలువడటంతో అగ్నిప్రమాదం భావించి పలువురు భవనంపై నుంచి దూకినట్లుగా తెలుస్తోంది. దాడి విషయం తెలియగానే భద్రతా దళాలు రంగంలోకి దిగి పాఠశాలను చుట్టుముట్టాయి. కాల్పులకు తెగబడినవారిని పట్టుకునేందుకు వారు సిద్ధమయ్యారు. దాడికి పాల్పడిన ఇద్దరిని భద్రతా దళాలు కాల్చిచంపాయి. షూటర్ వయస్సు 19 సంవత్సరాల వరకు ఉంటుందని, అతడి వద్ద రిజిస్టర్డ్ గన్ ఉన్నదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. 17 ఏండ్ల వయసున్న ఒక‌ వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాఠశాల భవనం దెబ్బతిన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!