ఎమ్మెల్యె ప‌ద‌వికి, పార్టీకి ఈటెల రాజీనామా

Share On

టిఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్యె ఈటెల రాజేంద‌ర్ త‌న ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా చేశారు. శామీర్‌పేట‌లోని త‌న ఇంటి నుంచి అనుచ‌రుల‌తో గ‌న్‌పార్క్ చేరుకొన్న ఆయ‌న‌ ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి, తుల ఉమ‌తో క‌లిసి, అమ‌ర‌వీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంత‌రం శాస‌న‌స‌భాప‌తి కార్యాల‌యంలో ఈట‌ల రాజీనామా ప‌త్రాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా కొన‌సాగా అని ఇప్పుడు రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపారు. త‌న‌ను రాజీనామ చేయ‌మ‌ని ప్ర‌జ‌లే ఆశీర్వ‌దించార‌న్నారు. తెరాస బీ ఫారం ఇచ్చి ఉండొచ్చు. కానీ గెలిపించింది ప్ర‌జ‌లు అని అన్నారు. అధికార దుర్వినియోగం చేసి ఉప‌ ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించారు

హుజూరాబాద్‌లో కౌర‌వులు, పాండ‌వుల‌కు యుద్ధం

హుజూరాబాద్‌లో కౌర‌వుల‌కు, పాండ‌వుల‌కు యుద్ధం జ‌ర‌గ‌బోతోంద‌ని ఈటల అన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశాన‌ని గుర్తు చేశారు. స‌మైక్య పాల‌కుల‌పై అసెంబ్లీలో గ‌ర్జించాన‌ని చెప్పారు. క‌రోనాతో వంద‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. తెలంగాణ‌ రాష్ట్రమే శ్రీ‌రామ ర‌క్ష అని కొట్లాడాం. అనేక మంది ఇత‌ర పార్టీల్లో గెలిచి రాజీనామా చేయకుండా తెరాస‌లో చేరి నిన్సుగ్గుగా మంత్రులుగా కొన‌సాగుతున్నారు. హుజూరాబాద్ ఎన్నిక యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ కుటుంబానికి మ‌ధ్య జర‌గ‌బోతోంది. వ‌డ్లు త‌డిచి మొల‌క‌లు వ‌చ్చినా ప‌ట్టించుకోరు. యువ‌తకు ఉపాధి లేక‌పోయినా స్పందించ‌రు. కానీ న‌న్ను చ‌క్ర‌బంధంలో పెట్టాలి అని పోలీసు అధికారుల‌ను వాడుతున్నారు. నాకు నిర్బంధాలు కొత్త‌కాదు.. నియంత నుంచి తెలంగాణ‌ను విముక్తి క‌ల్పించ‌డ‌మే నా ఎజెండా. అంద‌రూ హుజురాబాద్ ప్ర‌జ‌ల‌కు అండగా ఉండండి. మ‌నిషిగా ప్ర‌తి ఒక్క‌రినీ ఆదుకుంటాన‌ని ఈటెల రాజేంద‌ర్ అన్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *