చనిపోయింద‌ని పామును ప‌ట్టుకున్నాడు

Share On

అత‌ను ఎవ‌రి ఇంట్లో పాము ఉంద‌ని స‌మాచారం తెలుస్తే చాలు వెంటనే వెళ్లి ప‌ట్టుకుంటాడు.. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో పాముల‌ను ప‌ట్టుకున్నాడు. అలాంటి వ్య‌క్తినే పాము కాటుతోనే మ‌ర‌ణించాడు. పాము చనిపోయిందనుకుని భావించి దానిని చేతిలో పట్టుకుని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా కాటేసింది. ఫలితంగా అతని ప్రాణాలు గాలిలో కలిశాయి. ఈ ఘటన మంత్రాలయం మండలం మాలపల్లిలో శుక్రవారం జరిగింది. గ్రామంలోని పాఠశాల వద్ద పాము కనిపించడంతో జనం వెంటనే రంగస్వామిని పిలిచించారు. అతను అక్కడికి చేరుకుని దానిని కర్రతో కొట్టాడు. చనిపోయిందనుకుని చేతితో పట్టుకుని చూస్తుండగా ఇంతలో కాటు వేసింది. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *