పెళ్లితంతులోనే న‌వ వ‌ధువుపై ఆడ‌ప‌డుచు దాడి

Share On

మూడు ముళ్లు, ఏడ‌డుగుల‌తో ఒక్క‌టై ఆనందంగా ఉండాల‌ని ప్ర‌తి వ‌ధూవ‌రులు క‌ల‌లుగంటారు. కాని కొంత‌మంది వ‌ధువుల‌కు ఆదినుంచే క‌ష్టాలు త‌ప్ప‌వు. అలాంటిది పెళ్లి చేసుకొని అత్తాగారింట్లో అడుగుపెట్టిన పెళ్లికూతురుకు అద‌న‌పు క‌ట్నం కోసం నిత్య‌న‌ర‌కం చూపించారు. అత్తారింటి వేధింపులు తగ్గకపోగా రోజురోజుకూ మరింత మితమీరుతుండటంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. అదనపు కట్నం కోసం ఆ మహిళను మానసిక, శారీరక వేధింపులకు గురిచేసిన అత్తారింటి వారిని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. అత్తారింటి వేధింపుల గురించి మహారాష్ట్రలోని నిగ్డికి చెందిన ఆ మహిళ(27) తెలిపిన వివరాలు పోలీసులనే విస్తుపోయేలా చేసింది.

2020 డిసెంబరులో పెళ్లి సమయంలోనే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. పెళ్లి సమయంలో అత్తింటి వారు పట్టుబడటంతో ఇతర కట్న కానుకలతో పాటు రూ.1 లక్ష నగదు, 20 తులాల బంగారం అదనంగా ఇచ్చుకున్నారు. అయినా అత్తింటి వారు సంతృప్తి చెందలేదు. పెళ్లి జరిగిన మరుసటి రోజు నవ దంపతులు తమ ఇంటికి సమీపంలో ఆలయంలో దైవదర్శనం కోసం వెళ్లారు. నవ వధువు పొరబాటున తన ఎడమ కాలును ముందు పెట్టి ఆలయంలోకి ప్రవేశించింది. అశుభకరమంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆడపడుచు నవ వధువని కూడా చూడకుండా అందరి ముందే ఆమె చెంపపై కొట్టింది. అతిథులు, ఆలయంలోని ఇతర భక్తుల సమక్షంలోనే తనను అలా అవమానించారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు వెల్లడించింది.

ఆ తర్వాత కూడా అత్తింటి వారు నిత్యం ఆమెను అదనపు కట్నం కోసం వేధించారు. మరింత డబ్బు తీసుకురాకుంటే పుట్టింటికి పంపేస్తామని బెదిరించారు. తన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి గురించి తెలిసిన ఆమె..అదనపు కట్నం తీసుకొచ్చేందుకు నిరాకరించడంతో నిత్యం మానసికంగా, శారీరకంగా ఆమెను హింసించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమె భర్త, ఆడపడుచు, అత్తపై పోలీసులు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *