హామీ ఇచ్చారు స‌రే.. అమ‌లెప్పుడు చేస్తారు

Share On

ఎన్నిక‌ల్లో గెలిచేవ‌ర‌కే హామీలు ఇచ్చి ఆ త‌ర్వాత ముఖం కూడా చూపెట్ట‌ని నాయ‌కుల‌కు కొదువే లేదు. ప్ర‌జ‌ల ఏలా ఉన్నారు, ఎన్ని క‌ష్టాలు ప‌డుతున్నార‌ని ప‌ట్టించుకునేవారు క‌రువైపోతున్నారు. తెలంగాణ‌లో నాయ‌కుల ప‌నితీరు మ‌రీ చిత్రంగా ఉంటుంది. జనగామ నియోజకవర్గానికి చెందిన గులాబీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఇచ్చిన హామిని ఎప్పుడు నెర‌వేరుస్తార‌ని ప్ర‌జ‌లు నిల‌దీశారు.

తన నియోజకవర్గంలోని రత్నతండా గ్రామానికి రోడ్డు వేయిస్తానని ఎన్నికల వేళ ముత్తిరెడ్డి హామీ ఇచ్చారు. ఆయన గెలిచారు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పటికి రెండున్నరేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు ఆ గ్రామానికి రోడ్డు వేయించలేదు. తాజాగా నర్మెట్ట మండలం మచ్చుపహాడ్ రిజర్వు ఫారెస్టులో మొక్కలు నాటేందుకు వచ్చారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ఆ తండావాసులు నిల‌దీశారు. ఆగపేట గ్రామంలో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తానని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు ఇప్పించలేదని నిలదీశారు. కారుకు అడ్డంగా రోడ్డుపై ధర్నాకు సైతం సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు వారిని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో కారు దిగి వచ్చిన ఎమ్మెల్యే.. తప్పకుండా రోడ్డు వేయిస్తానని సర్దిచెప్పి వెళ్లిపోయారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *