భ‌ర్త‌ను వ‌దిలి మామ‌తో అక్ర‌మ సంబంధం

Share On

ఒకే ఇంట్లో తండ్రితో కొడుకు, కోడ‌లు ఉంటున్నారు.. కొడుకు తన ప‌నిమీద బ‌య‌టికి వెళ్లేస‌రికి కోడ‌లిపై మామ క‌న్నుప‌డింది. ఇద్ద‌రూ ఏకాంతంగా ఉండ‌డంతో ఇంక ఆల‌స్యం చేయ‌డం ఎందుక‌ని నేరుగా త‌న మ‌న‌సులో మాట‌ను కోడ‌లికి చెప్పాడు. కోడ‌లు కూడా అందుకు సిద్ద‌మైపోగా భ‌ర్త బ‌య‌టికి వెళ్ల‌గానే మామ‌, కోడ‌ళ్ల అక్ర‌మ సంబంధానికి అడ్డేలేకుండా పోయింది. ఈ విష‌యం కాస్త కొడుక్కు తెలియ‌డంతో భార్య‌ను, తండ్రిని ఇద్ద‌రిని నిల‌దీశాడు. ఇక విషయం భర్తకు తెలియడంతో భార్య జీర్ణించుకోలేకపోయింది. తన సుఖానికి కొడుకు అడ్డు పడుతున్నాడని తండ్రి కక్ష పెంచుకొని క‌న్న‌కొడుకునే దారుణంగా హ‌త్య చేపించిన సంఘ‌ట‌న బీహార్‌లో జ‌రిగింది.

బిహార్‌ రాజధాని పాట్నా సమీపంలోని కొద్రాకు చెందిన మిథిలేశ్‌ రవిదాస్‌ కుమారుడు సచిన్కు కొన్నేళ్ల కిందట వివాహమైంది. భర్త, మామతో కలిసి ఆమె జీవిస్తోంది. ఈ క్రమంలో మామ ఆమెపై కన్నేశాడు. మెల్లగా ఆమెకు దగ్గరై వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. అలా మామ, కోడలు కొన్నాళ్లుగా సంబంధం కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులకు కుమారుడికి తన ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఒకసారి తన భార్యకు చేరువగా ఉండడాన్ని గమనించి తండ్రిని నిలదీశాడు. తన భార్యతో తండ్రి సాగిస్తున్న సంబంధం తెలుసుకుని షాక్ తిన్నాడు. దీనిపై ముగ్గురు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోడలితో సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించి కొడుకు హత్యకు ప్రణాళిక రచించాడు. కొడుకు సచిన్‌తో జూలై 7వ తేదీన గొడవపడిన తండ్రి మిథిలేశ్‌ రవిదాస్‌ కొద్దిసేపటికి కత్తితో గొంతుకోసి అతి దారుణంగా హతమార్చాడు. తరువాత మృతదేహాన్ని ఓ తోటలో పడేశాడు. అయితే తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి సంఘటనను తప్పుదోవ పట్టించాడు. కొంతమందిపై అనుమానం ఉందని ఓ ఐదుగురి పేర్లు కూడా చెప్పారు. వారిని విచారణ చేస్తుండగానే తండ్రి చేసిన ఘాతుకం బహిర్గతమైంది. నిందితుడు మిథిలేశ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రాజీవ్‌ సింగ్‌ తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *