వ‌ధువు డాక్ట‌ర్‌.. వ‌రుడు బ్యాంకు మేనేజ‌ర్.. ఐనా

Share On

ఇద్ద‌రు ఉద్యోగులే.. పెద్ద చ‌దువులు చ‌దివిన వారే.. వ‌ధువేమో డాక్ట‌ర్‌, వ‌రుడెమో బ్యాంకు మేనేజ‌ర్‌.. వారిద్ద‌రికి కొన్ని వారాల కింద‌ట నిశ్చితార్థం జ‌రిగింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరిపేందుకు ఇరు కుటుంబాలు ప్రయత్నాలు జరుపుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే బ్యాంకు మేనేజర్ బాంబు పేల్చాడు. తాను ఈ పెళ్లి చేసుకోవాలంటే అదనపు కట్నం కావాలని డిమాండ్ చేశాడు. ఇందుకోసం అమ్మాయి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులు భరించలేక అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం సౌదర దిన్నె గ్రామానికి చెందిన యువతి ఈఎన్‌టీ డాక్టర్‌గా పనిచేస్తుంది. ఆమె కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటుంది. అయితే జూన్ 6వ తేదీన ఆమెకు.. కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండ‌లానికి చెందిన దుబ్బ మానోజ్‌కుమార్‌ రెడ్డి నిశ్చితార్థం జరిగింది. మనోజ్‌కుమార్ రెడ్డి కర్ణాటక‌లోని ఉడిపి జిల్లాలో బేలూరులోని ఒక‌ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నిశ్చితార్థం జరిగిన సమయంలో యువతి కుటుంబం రూ. 50 వేలను మనోజ్‌కుమార్‌రెడ్డికి ఇచ్చింది. అలాగే వరకట్నం కింద ఐదెకరాల భూమి, రూ.25 లక్షల ప్లాటు, 40 తులాల బంగారం, పెండ్లి ఖర్చులకు రూ.3 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. పెండ్లి పనులు మొదలయ్యాయి. అయితే నిశ్చితార్థం అయిన కొన్ని వారాలకు మనోజ్‌కుమార్‌రెడ్డి మనసు మార్చుకున్నాడు. జూలై 25న యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన మనోజ్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులు తమ అబ్బాయికి అదనపు కట్నం కావాలని డిమాండ్ చేశారు. కట్నం కింద మరో 5 ఎకరాలు అదనంగా ఇవ్వాలని.. లేకుంటే ఈ పెళ్లి జరగదని చెప్పారు. ఈ క్రమంలోనే యువతి కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోజ్‌కుమార్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *