ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా భార్య ఇంకా పిల్ల‌లు కావాలంటుంద‌ని..

Share On

ఒక వ్య‌క్తికి ఇద్ద‌రు పిల్ల‌లుండ‌గా భార్య రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయింది. త‌న పిల్ల‌ల‌ను చూసుకోవ‌డం కోసం ఆ వ్య‌క్తి మ‌రో పెళ్లి చేసుకున్నాడు. అప్ప‌టికి వారి వ‌య‌స్సు 40సంవ‌త్స‌రాలు దాటింది. ఐనా రెండో భార్య త‌న‌కు పిల్ల‌లు కావాల‌ని భ‌ర్త‌ను రోజు మానసికంగా, శారీర‌కంగా వేధిస్తూ ఉండేది. ఉన్న ఇద్ద‌రు పిల్ల‌లు చాలు, 40 సంవ‌త్స‌రాల త‌ర్వాత పిల్ల‌లు క‌ష్ట‌మేన‌ని భ‌ర్త ఎంత చెప్పినా ఆ భార్య వినిపించుకోకుండా నిత్యం భ‌ర్తపై గొడ‌వ‌కు దిగేది. భార్య ఎంత చెప్పినా విన‌డం లేద‌ని, ఆ వేధింపులు త‌ట్టుకోలేక భ‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

శ్రీకాకుళంలోని మెరక వీధిలో నివాసం ఉంటున్న52 ఏళ్ల బత్తుల భాస్కరరావు ఒక‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయనకు 22 ఏళ్ల కిందట సోంపేటకు చెందిన ఒక‌ మహిళతో వివాహం జరిగింది. అయితే గతేడాది జరిగిన బైక్ ప్రమాదంలో ఆమె మరణించింది. వీరికి ఇంజినీరింగ్ సెకెండ్ ఇయర్ చదువుతున్న కుమారుడు.. నాలుగ‌వ‌ తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. కానీ భార్య లేకపోవడం.. పిల్లల ఆలనా పాలన చూసుకోవడం కోసం గతేడాది జూన్ 25న ఈయన ఒడిశాలోని రాయగకు చెందిన వెంకటరత్నంను రెండో పెళ్లి చేసుకున్నాడు. త‌న‌కు కూడా పిల్ల‌లు కావాల‌ని త‌ర‌చూ వేధింపుల‌కు గురిచేసేది. ఇలా వారి మధ్య సంతానం కోసం తరచూ గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి కూడా ఇద్దరూ ఇదే విషయంలో వాదించుకున్నారు. మంగళవారం ఉదయం చూసేసరికి భాస్కరరావు ఇంటి పెరటిలో ఉన్న బావిలో శవమై తేలి కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడి తల్లి మహలక్ష్మి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు పట్టణ ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *